• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఆధార్, పాన్ కార్డ్‌లో అడ్రస్ మార్చాలా? నిమిషాల్లో ఇంట్లోనే ఇలా మార్చుకోండి!

ఆధార్, పాన్ కార్డ్‌లో అడ్రస్ మార్చాలా? నిమిషాల్లో ఇంట్లోనే ఇలా మార్చుకోండి!

మన దేశంలో ఆధార్, పాన్ కార్డులు ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమైనవి. ఆధార్ కార్డు ఒక గుర్తింపు కార్డుగా ఉపయోగపడితే, పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలకు తప్పనిసరి. ఈ రెండింటిలో కూడా చిరునామా, ఇతర వివరాలు ఖచ్చితంగా అప్‌డేటెడ్‌గా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఆన్‌లైన్‌లోనే సులభంగా ఆధార్, పాన్ కార్డులను ఎలా అప్‌డేట్ చేసుకోవాలో ఆ స్టెప్ బై స్టెప్ ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 04, 2026, 05:15 PM IST|Updated: Oct 04, 2026, 05:18 PM IST
joinshare
ఆధార్, పాన్ కార్డ్‌లో అడ్రస్ మార్చాలా? నిమిషాల్లో ఇంట్లోనే ఇలా మార్చుకోండి!
Image Credit: Aadhaar-PAN Update

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
లవంగం బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే జరిగే వింత ఇదే! ఎవ్వరూ చెప్పని 5 సీక్రెట్స్!

లవంగం బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే జరిగే వింత ఇదే! ఎవ్వరూ చెప్పని 5 సీక్రెట్స్!

2

Jio 3-In-1 Home Pack: జియో వినియోగదారులకు గుడ్‌న్యూస్..ఒకే రీఛార్జ్‌పై 1000 టీవీ ఛానళ్లు, 12 ఓటీటీలు ఉచితం!

3

Manchu Manoj: భార్య మౌనిక పుట్టినరోజున ఎమోషనల్ అయిన మంచు మనోజ్..!

4

Kollam Anju Case: అశ్లీల వెబ్‌సైట్‌లో శోభనం వీడియోలు..నవ వధువును ఘోరంగా టార్చర్ చేస్తున్న వరుడు!

5

ఆధార్, పాన్ కార్డ్‌లో అడ్రస్ మార్చాలా? నిమిషాల్లో ఇంట్లోనే ఇలా మార్చుకోండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Aadhaar-PAN Update: ఆధార్, పాన్ కార్డుల అప్‌డేట్ కోసం ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చుని మొబైల్ ఫోన్ ద్వారా కూడా వీటిని అప్‌డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో భారతదేశంలో ఈ రెండు కార్డులు కలిగి ఉండటం తప్పనిసరి. ఆధార్ 12 అంకెల సంఖ్యను కలిగి ఉంటుంది. దీనికి పాన్ కార్డు లింక్ చేసి ఉండాలి. ఆదాయపు పన్ను ఫైల్ చేసే వారికి పాన్ కార్డు తప్పనిసరి. మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్‌లో ఖాతా తెరవాలన్నా, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా ఈ రెండు కార్డులు అవసరం. ఆధార్ కార్డు మన బయోమెట్రిక్ వివరాలను కలిగి ఉంటుంది. అందుకే ఈ రెండింటినీ లింక్ చేయడం కూడా తప్పనిసరి చేశారు. ఈ క్రమంలో ఆధార్, పాన్ కార్డు వివరాలు సరిపోలాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలి. దీని కోసం మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఇంట్లోనే సులభంగా మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డుపై అడ్రస్ అప్‌డేట్ చేసే విధానం:
ఆధార్ కార్డుపై వివరాలను అప్‌డేట్ చేయడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. 'మై ఆధార్' పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా దీనిని సులభంగా పూర్తి చేయవచ్చు. మై ఆధార్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి, మీ ఆధార్ నంబర్‌తో ఓటీపీ వెరిఫికేషన్ చేయండి. అక్కడ అడ్రస్ అప్‌డేట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానికి కావాల్సిన చిరునామా పత్రాలను  అప్‌లోడ్ చేసి, వివరాలను సరిచూసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.

పాన్ కార్డుపై అడ్రస్ అప్‌డేట్ చేసే విధానం:
పాన్ కార్డును అప్‌డేట్ చేయాలంటే 'NSDL' పోర్టల్‌ను ఓపెన్ చేస్తే సరిపోతుంది. అక్కడ 'Change or Correction' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ పాన్ నంబర్ ఇతర వివరాలను ఎంటర్ చేసి, ఆధార్ ఆధారంగా e-KYC చేయాలి. ఈ వెరిఫికేషన్ ఓటీపీ ద్వారా పూర్తవుతుంది. ఆ తర్వాత మీ కేవైసీ పూర్తి కావడంతో అడ్రస్ కూడా అప్‌డేట్ అయిపోతుంది.

కావలసిన డాక్యుమెంట్స్:
పాన్ కార్డు చిరునామా అప్‌డేట్ చేయడానికి పాస్‌పోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఓటర్ ఐడి, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు లేదా గ్యాస్ బిల్లు వంటివి సరిపోతాయి.

Read Also: పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీమ్.. రోజుకు రూ.300 దాచిపెడితే చేతికి రూ.6.42 లక్షలు! పూర్తి క్యాలిక్యులేషన్!

బ్యాంకింగ్ లేదా కేవైసీ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అడ్రస్ అప్‌డేట్ చేయడం తప్పనిసరి. కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా వీటితో ముడిపడి ఉంటాయి కాబట్టి, సరైన చిరునామా కలిగి ఉండటం ముఖ్యం. పాన్, ఆధార్ లింక్ చేయడం వల్ల టాక్సేషన్ ప్రక్రియ కూడా సులభతరం అవుతుంది. ఈ డిజిటల్ యుగంలో ఆధార్ కార్డుపై అడ్రస్‌ను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే మీ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోండి.

Add Zee News as a Preferred Source
TAGS:
Aadhaar Card