• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /మైనస్ 10 డిగ్రీల చలి.. రాయిలా మారిన ఆర్మీ జవాన్ యూనిఫాం! వీడియో..

మైనస్ 10 డిగ్రీల చలి.. రాయిలా మారిన ఆర్మీ జవాన్ యూనిఫాం! వీడియో..

Army Uniform Freezes Viral Video: ఒక ఆర్మీ జవాన్‌ మైనస్‌ డిగ్రీల వాతావరణంలో ఆరేసిన ఆర్మీ యూనిఫాంకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన పడుతున్న కష్టాన్ని గురించి వివరించారు. అయితే, ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 21, 2026, 12:35 IST|Updated: Nov 21, 2026, 12:37 IST
joinshare
మైనస్ 10 డిగ్రీల చలి.. రాయిలా మారిన ఆర్మీ జవాన్ యూనిఫాం! వీడియో..
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Army Uniform Freezes Viral Video: మనం ఇంట్లో కాస్త చలి వేస్తేనే స్వెటర్లతో పాటు దుప్పట్లు కప్పుకుని వెచ్చగా నిద్రపోతూ ఉంటాం.. ఉష్ణోగ్రతలు కొద్దిగా పడిపోతే బయటకు అడుగు పెట్టడానికి కూడా చాలా మంది ఇష్టపడరు.. కానీ, మనం ప్రశాంతంగా నిద్రపోవడం కోసం దేశ సరిహద్దుల్లో మన సైనికులు పడే కష్టాలు వర్ణనాతీతంగా చెప్పొచ్చు.. ఎముకలు కొరికే చలిలో.. మంచు తుపానుల మధ్య ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారు కష్టపడి పనులు చేస్తూ ఉంటారు. తాజాగా.. సరిహద్దుల్లోని సైనికుల కఠిన పరిస్థితుల్లో కూడా ఎంతో కష్టపడుతూ డ్యూటీ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ సైనికులకు సెల్యూట్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలు? ఇది ఎక్కడ జరిగింది? దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్‌స్టాగ్రామ్‌లోని ది సోల్జర్స్ విజ్జు అనే అకౌంట్‌ నుంచి షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది.. ఈ వీడియోలో ఒక జవాను రాత్రి సమయంలో బయట.. ఉంచిన తన ఆర్మీ యూనిఫాంను చూపిస్తూ.. అక్కడి వాతావరణ తీవ్రతను వివరించడం మీరు ఈ వీడియోలో క్లియగ్‌ చూడొచ్చు.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో.. విపరీతమైన మంచు కురిసి జవాను దుస్తులు పూర్తిగా గడ్డకట్టుకుపోవడం మీకు కనిపించడం మీరు గమనించవచ్చు.. ఆ యూనిఫాం ఎంతలా గట్టిపడిందంటే.. ఆ జవాను దాని చేతిని పైకి ఎత్తి వదిలినా అది కిందకు వాలకుండా అట్టముక్కలా.. ఇనుప రేకులా నిటారుగా నిలబడి ఉండడం మీరు గమనించవచ్చు.. కనీసం మడత పెట్టడానికి కూడా వీలులేనంతగా ఆ యూనిఫాం రాయిలా మారిపోవడం మీరు గమనించవచ్చు..

ఈ వీడియోతో ఆ జవాను సమాజానికి ఒక సందేశాన్ని అందించారు..  చాలా మందికి సైనికులకు వచ్చే జీతభత్యాలు మాత్రమే కనిపిస్తాయి.. కానీ.. ఆ జీతం కోసం మేము ఎలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో పనిచేస్తున్నామో ఎవరికీ తెలియదు.. అంటూ ఆయన వాస్తవాన్ని కళ్లకు కట్టారు.. ఎండైనా, వానైనా, ఇలా మైనస్ డిగ్రీల గడ్డకట్టే చలైనా సరిహద్దుల్లో కాపలా కాయడం అంత సులభం కాదని ఈ దృశ్యాలు స్పష్టం చేస్తూ వస్తున్నాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ వస్తున్నారు. నిజమైన హీరోలు మీరే సర్.. మీ త్యాగాలకు వెలకట్టలేం.. అంటూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. కేవలం ఒక గడ్డకట్టిన యూనిఫాం దృశ్యంగానే కాకుండా.. దేశ రక్షణ కోసం సైనికులు అనుభవిస్తున్న అనేక సమస్యలకు నిలువెత్తు సాక్ష్యంగా ఈ వీడియో నిలుస్తోంది..

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by 😎the soldier's (@the_soldiers_vijju)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News