• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీ.. Infinix GT 50 Pro 5G ఫోన్‌ ప్రత్యేకతలు ఇవే!

AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీ.. Infinix GT 50 Pro 5G ఫోన్‌ ప్రత్యేకతలు ఇవే!

Infinix GT 50 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ అద్భుతమైన బ్యాటరీతో అక్టోబర్ 27న అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, ఇది చాలా ప్రత్యేకంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 26, 2026, 01:00 PM IST|Updated: Oct 26, 2026, 01:01 PM IST
joinshare
AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీ.. Infinix GT 50 Pro 5G ఫోన్‌ ప్రత్యేకతలు ఇవే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తుపానుకు ముందు ప్రజలు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఇవే..

తుపానుకు ముందు ప్రజలు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఇవే..

2

Lucknow: ఓర్నీ.. గుడికి వెళ్లి అమ్మవారికి దండం పెట్టి మరీ యువతి ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..

3

Chiranjeevi Talk Show: ఓటీటీలోకి అడుగుపెట్టనున్న మెగాస్టార్.. టాక్‌ షో కోసం నెట్‌ఫ్లిక్స్‌తో భారీ డీల్

4

సెర్బియాలో సంచలనం.. విద్యార్థుల చేతిలో చిత్తుగా ఓడిన నియంత.. 14 ఏళ్ల వూచిక్ పాలనకు చరమగీతం..!!

5

10,000mAh బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే.. వివో Y600 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Infinix కంపెనీ త్వరలోనే తమ వినియోగదారులకు అద్భుతమైన గుడ్‌ న్యూస్‌ చెప్పబోతోంది. అత్యంత త్వరలోనే ఇన్ఫినిక్స్ కంపెనీ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. దీనిని కంపెనీ ఇన్ఫినిక్స్ GT 50 ప్రో 5G పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అక్టోబర్ 27న విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌ లాంచ్‌ అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఇన్ఫినిక్స్ GT 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 144Hz శక్తివంతమైన రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో లాంచ్‌ కానుంది. అంతేకాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది  AMOLED స్క్రీన్‌తో పాటు డాల్బీ అట్మోస్ సౌండ్‌కు సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఇన్ఫినిక్స్ GT 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్‌కి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే మొదలయ్యాయి.. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ఫోన్‌ను రూ.1,999 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు.. ఆ తర్వాత రూ.35,999 వరకు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.5,000 వరకు తక్షణ తగ్గింపు కూడా లభిస్తోంది..

ఇన్ఫినిక్స్ GT 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్‌లో 144Hz AMOLED డిస్‌ప్లేతో పాటు 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో పాటు 2800Hz టచ్ శాంప్లింగ్ రేట్‌లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.. ఈ డిస్‌ప్లే ఆరు వేళ్ల మల్టీటచ్‌కు సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది. చేతులు చెమట పట్టినప్పుడు కూడా టచ్ పన్‌ చేసేందుకు ఈ ఫోన్ చాలా ప్రత్యేకమైన డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..

ఈ స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. ఇది డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది.. ఇందులో ప్రెజర్-సెన్సిటివ్ GT ట్రిగ్గర్‌లు కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ కంపెనీ ఫోన్‌తో పాటు కన్సోల్-స్టైల్ కంట్రోలర్, మాగ్నెటిక్ కూలర్ వంటి గేమింగ్ యాక్సెసరీలను కూడా సపోర్ట్‌ చేస్తున్నట్లు సమాచారం.

ఇన్ఫినిక్స్ GT 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ చాలా ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఈ ఫోన్‌లో హైడ్రోఫ్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా లభిస్తోంది.. దీని ప్రత్యేకత ఏమిటంటే.. దీని వెనుక ప్యానెల్‌పై ఒక పైప్‌లైన్ కూడా లభిస్తోంది. ఇందులో చాలా ప్రత్యేకమైన 50MP ప్రధాన సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రావైడ్ సెన్సార్ కూడా లభిస్తోంది. ఇందులో ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీ కూడా లభిస్తోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News