Toofan Alert Precations: ఆర్నాబ్ తుపాను నేపథ్యంలో ప్రజలు అధికారిక టీవీ వార్తలు, రేడియో ద్వారా వాతావరణ శాఖ చెప్పిన హెచ్చరికలను మాత్రమే ఫాలో అవ్వండి. సోషల్ మీడియాలో వచ్చే ఇతరత్రా ప్రచారాలను నమ్మి ప్యానిక్ కావొద్దు.
తుపానును ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మోద్దు. ధృవీకరించిన అధికారిక రేడీయో లేదా టీవీ, న్యూస్ పేపర్స్‌లో వచ్చే సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వండి.
తుపాను నేపథ్యంలో కరెంట్ తరుచుగా వచ్చి పోయే అవకాశాలున్నుందున అత్యవసర సమాచారం కోసం మొబైల్ ఫోన్లను పూర్తిగా ఛార్జింగ్ చేసి ఉంచుకోండి. అవసరమైతే పవర్ బ్యాంక్‌లను రెడీగా పెట్టుకోండి.
తుపాను నేపథ్యంలో ఇంటర్నెట్ ఇష్యూ కారణంగా యూపీఐ సేవలు పనిచేయకపోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు ముందుగానే బ్యాంకులను నుంచి కానీ ఏటీఎంల నుంచి తగినంత డబ్బును డ్రా చేసి చేతిలో పెట్టుకోవడం బెటర్.
-మీ విలువైన సర్టిఫికేట్లను వాటర్ ప్రూఫ్ కవర్స్‌లో భద్రపరుచుకోవడం బెటర్.
-ఇంటికి కావాల్సిన కొన్ని అత్యవసర సామాగ్రిని, మందులను ముందే సిద్ధంగా ఉంచుకోండి.
-ఇంటి పై కప్పుకు సంబంధించిన పనులను ముందే పర్యవేక్షించుకోండి. అవసరమైతే రిపేర్లు చేయించండం బెటర్.
-వరదలు లేదా ఉప్పెన వంటి ప్రమాదాలు తలెత్తితే వెంటనే ఎత్తైన, సురక్షిత ప్రాంతానికి వెళ్లండి.
-కనీసం ఒక వారానికి సరిపడా ఆహారం, తాగునీటిని నిల్వ ఉంచుకోండి.
-తలుపులు, కిటీకీలను సురక్షితంగా మూసివేయండి.
-ప్రభుత్వ అధికారులు చెప్పే సలహాలు, సూచనలు ఫాలో అవ్వండి. లోతట్టు ప్రాంతాల ప్రజలతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి.
తుపాను సమయంలో తర్వాత ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈశాన్య ఋతుపవనాలు నేపథ్యంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం రేపు తీవ్ర తుపానుగా మారనుంది. రేపటి నుంచి మూడు రోజులు పాటు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు తుపాను సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తుపాను సమయంలో ఇంట్లో ఉంటే..
-ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి.. గ్యాస్ కనెక్షన్‌ను తెలిగించండి.
-తలుపులు, కిటికీలు మూసి ఉంచండి.
-లోతట్టు ప్రాంతంలో సురక్షిత ప్రదేశంలో లేకుంటే ప్రభుత్వం సూచించిన షెల్టర్ జోన్‌కు వెళ్లండి.
-కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగండి.
-భవనం దెబ్బ తినే సూచనలు ఉంటే బలమైన టేబుల్ కింద కూర్చొని మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
తుపాను సమయంలో బయట ఉంటే..
-వర్షం పడే సమయంలో పాత కాలం నాటి భవనాల్లో ఉండకూడదు.
-చెట్లు కింద, విద్యుత్ స్తంభాలకు దగ్గర , హోర్డింగులకు కింద నిలబడరాదు.
-ఈదురు గాలులు ప్రభావం ముగిసినా.. వాతావరణ శాఖ అధికారులు అంతా ఓకే అనేంతకు వేచి ఉండటం బెటర్.
తుపాను తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..
-తుపాను తీవ్రత తగ్గిన తర్వాత ఇంట్లో ప్రభుత్వ కొలాయి నీళ్లను కాచి చల్లార్చిన తర్వాత మాత్రమే తాగాలి.
-షెల్టర్ జోన్లో ఉండే వాళ్లు అధికారిక సమాచారం వచ్చే వరకు షెల్టర్ వదిలి బయటకు వెళ్లవద్దు.
-బయట నడిచేటపుడు, బండి నడిపేటపుడు పరిసరాలను పూర్తిగా గమనించాలి. ఎక్కడా విద్యుత్ తీగలు తెగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో తెగిపడిన తీగలు, విరిగిన విద్యుత్ స్తంభాల పట్ల జాగ్రత్త వహించాలి.
- దెబ్బ తిన్న ఎలక్ట్రికల్ వస్తువును అనుభజ్ఞుడైన ఎలక్ట్రిషియన్ తనిఖీ చేసిన తర్వాత వాడండి.
మత్య్సకారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సముద్రంలో వేటకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లవద్దు.
మొబైల్ ఫోన్లను పూర్తిగా ఛార్జ్ చేసి ఉంచుకోవడం బెటర్.
ఎక్స్‌ట్రా బ్యాటరీ రేడీయోలను సిద్దంగా ఉంచుకోండి.
పడవలు / తెప్పలను సురక్షితమైన ప్రాంతంలో బలమైన తాడుతో కట్టి ఉంచుకోవడం బెటర్.