డిసెంబర్‌లో iQOO 16R లాంచ్.. 10,000mAh బ్యాటరీతో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్!
iQOO 16R Launch: డిసెంబర్ నెలలో iQOO 16R స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా ఇది మోస్ట్ పవర్‌ఫుల్ 10,000mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే, దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
iQOO 16R Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో సబ్-బ్రాండ్ ఐక్యూ.. భారత మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.. గత సెప్టెంబర్ నెలలో చైనా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన iQOO 16 స్మార్ట్‌ఫోన్‌కి మంచి ప్రజాదరణ లభించింది.. ఇటీవల జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమ్మిట్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను పదర్శించినట్లు తెలుస్తోంది. దీని బట్టి చూస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ త్వరలోనే అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే భారత మార్కెట్‌లోకి iQOO 16R స్మార్ట్‌ఫోన్ కూడా లాంచ్ కాబోతోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ I2606 మోడల్ నంబర్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.. iQOO స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.. గతంలో ఇదే మోడల్ నంబర్ మలేషియాకు చెందిన SIRIM సర్టిఫికేషన్ సైట్‌లోనూ కనిపించినట్లు తెలుస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ iQOO 16s స్మార్ట్‌ఫోన్ పేరుతో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. సర్టిఫికేషన్ లిస్టింగ్‌లో మాత్రం ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు..
ఈ iQOO 16R స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 6 ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు కొన్ని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.. ముఖ్యంగా గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేకంగా యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను కూడా అందిస్తున్నారు. అలాగే ఇది మోస్ట్ పవర్‌ఫుల్ 10,000mAh భారీ బ్యాటరీతో పాటు 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది..
ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లోని ప్రధాన మోడల్ iQOO 16 డిసెంబర్ నెలలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే ఈ మొబైల్ చైనాలో విడుదలైన సంగతి తెలిసిందే.. ఇది 6.85-అంగుళాల 2K ప్లస్ సాంసంగ్ M16 LTPO AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇది 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఇది ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 5 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పాటు అడ్రెనో GPUతో పాటు ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఒరిజిన్OS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో OIS సపోర్ట్‌తో 50MP ప్రధాన కెమెరాతో పాటు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఇటీవల vivo I2607 మోడల్ నంబర్‌తో గీక్‌బెంచ్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించింది.. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో iQOO 16 వేరియంట్‌గా అందుబాటులోకి రాబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.