• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /యువకుడిని క*త్తులతో పొడిచి.. స్కూటర్‌పై ఇంటి ముందు పడేసిన దుండగులు.. వీడియో!

యువకుడిని క*త్తులతో పొడిచి.. స్కూటర్‌పై ఇంటి ముందు పడేసిన దుండగులు.. వీడియో!

Gurugram Knife Attack Video: గురుగ్రామ్‌లో ఓ దారున ఘటన జరిగింది. ఓ యువకుడిని కొట్టి.. స్కూటీపై తీసుకు వచ్చి.. తన ఇంటి ముందు పడేసి వెళ్లారు. ఈ ఘటన CC టీవీలో రికార్డ్‌ అయ్యింది. ఇప్పుడు ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 13, 2026, 03:20 PM IST|Updated: Nov 13, 2026, 03:22 PM IST
joinshare
యువకుడిని క*త్తులతో పొడిచి.. స్కూటర్‌పై ఇంటి ముందు పడేసిన దుండగులు.. వీడియో!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
మీ జ్ఞాపకశక్తి పెరగాలన్నా.. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ ఈ డ్రై ఫ్రూట్ తినాల్సిందే!

మీ జ్ఞాపకశక్తి పెరగాలన్నా.. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ ఈ డ్రై ఫ్రూట్ తినాల్సిందే!

2

Love Failure: కులం అడ్డంకితో ప్రేమ విఫలం.. కాబోయే మహిళా ఎస్సై ఆత్మహత్య

3

యువకుడిని క*త్తులతో పొడిచి.. స్కూటర్‌పై ఇంటి ముందు పడేసిన దుండగులు.. వీడియో!

4

రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. త్వరలోనే RAC టికెట్ల రద్దు? ప్రయాణికులకు ఇకపై ఫుల్ బెర్త్ గ్యారెంటీ!

5

India Vs New Zealand: టీమిండియాకు ఘోర అవమానం.. వన్డే చరిత్రలో రెండో అతిపెద్ద ఓటమి..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gurugram Knife Attack Video: హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.. పాత కక్షలతో 25 ఏళ్ల యువకుడిపై కొందరు దుండగులు అత్యంత కిరాతకంగా దాడి చేశారు.. కర్రలతో చితకబాదడమే కాకుండా క*త్తులతో పొడిచి.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని.. వారు స్కూటర్‌పై తీసుకెళ్లి ఏకంగా అతడి ఇంటి గుమ్మం ముందే పడేసి వెళ్లారు.. ఈ ఘటన CC టీవీల్లో రికార్డ్‌ అయ్యింది. ఇప్పుడు ఇదే వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటనకు ప్రధాన కారణాలేంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పూర్తి వివరాల్లోకి వెళితే.. బాధితుడిని నితిన్‌గా గుర్తించారు.. తుషార్ సర్వాన్‌తో పాటు లౌకీ సర్వాన్, సాహిల్ సర్వాన్ అనే ముగ్గురు యువకులతో పాటు వారి తండ్రి జూడీ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.. నితిన్‌ను నేలపై పడేసి కర్రలతో కొట్టి.. కత్తితో పొడిచారట.. అయితే, నితిన్ స్పృహ కోల్పోయాక.. తండ్రి ఆదేశాల మేరకు ఆ ముగ్గురు కుమారులు నితిన్‌ను స్కూటర్ ముందు భాగంలో పడుకోబెట్టి సందుల గుండా అతడి ఇంటికి తీసుకెళ్లారట..

బాధితుడి ఇంటి ఎదురుగా ఉన్న సీసీటీవీ కెమెరాలో నిందితుల సంబంధించిన దృష్యాలు రికార్డ్‌ అయ్యాయి.. స్కూటర్ ముందు భాగంలో తల, కాళ్లు ఇరువైపులా వేలాడుతుండడం మీరు చూడొచ్చు.. నెమ్మదిగా నితిన్‌ను తీసుకొచ్చిన ఒక యువకుడు.. ఇంటి ముందు స్కూటీని ఆపడం మీరు గమనించవచ్చు.. ఈ తర్వాత లేవలేని స్థితిలో ఉన్న నితిన్ కాళ్లను పట్టుకుని.. కిందకు లాగే క్రమంలో బ్యాలెన్స్ తప్పి స్కూటర్ కిందపడిపోవడం కూడా మీరు చూడొచ్చు. నిందితుడు స్కూటర్‌ను పైకి లేపి.. ఆ తర్వాత నితిన్ చేయి పట్టుకుని.. అతికిరాతకంగా రోడ్డుపైకి లాగి అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరార్‌ కావడం కూడా మీరు క్లియర్‌గా ఈ వీడియోలో చూడొచ్చు.. ఈ దృశ్యాన్ని చూసిన ఇరుగుపొరుగు వారు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది..

ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నితిన్ మాట్లాడుతూ.. తమ కుటుంబానికి నిందితుల కుటుంబానికి మధ్య ఎప్పటినుంచో పాత కక్షలు ఉన్నాయన్నాడు. గతంలో నిందితులతో విభేదాలు ఉన్నప్పటి నుంచి తమ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎవరూ ప్రాణాలతో లేరని.. అయినా వారిలో పగ చల్లారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు ప్లాన్‌ ప్రకారమే తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు..

— Dharamvir Sharma (@DharamvirNews) November 12, 2026

Add Zee News as a Preferred Source
TAGS:
Viral News
Telugu News
Trending News