• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /India Vs New Zealand: టీమిండియాకు ఘోర అవమానం.. వన్డే చరిత్రలో రెండో అతిపెద్ద ఓటమి..!

India Vs New Zealand: టీమిండియాకు ఘోర అవమానం.. వన్డే చరిత్రలో రెండో అతిపెద్ద ఓటమి..!

India Vs New Zealand 4th Odi Highlights: కివీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఏకంగా 244 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. 344 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయింది.

Written ByAshok Krindinti
Published: Nov 13, 2026, 03:06 PM IST|Updated: Nov 13, 2026, 03:07 PM IST
joinshare
India Vs New Zealand: టీమిండియాకు ఘోర అవమానం.. వన్డే చరిత్రలో రెండో అతిపెద్ద ఓటమి..!
Image Credit: India Vs New Zealand 4th Odi Highlights (Source: X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
మీ జ్ఞాపకశక్తి పెరగాలన్నా.. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ ఈ డ్రై ఫ్రూట్ తినాల్సిందే!

మీ జ్ఞాపకశక్తి పెరగాలన్నా.. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ ఈ డ్రై ఫ్రూట్ తినాల్సిందే!

2

Love Failure: కులం అడ్డంకితో ప్రేమ విఫలం.. కాబోయే మహిళా ఎస్సై ఆత్మహత్య

3

యువకుడిని క*త్తులతో పొడిచి.. స్కూటర్‌పై ఇంటి ముందు పడేసిన దుండగులు.. వీడియో!

4

రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. త్వరలోనే RAC టికెట్ల రద్దు? ప్రయాణికులకు ఇకపై ఫుల్ బెర్త్ గ్యారెంటీ!

5

India Vs New Zealand: టీమిండియాకు ఘోర అవమానం.. వన్డే చరిత్రలో రెండో అతిపెద్ద ఓటమి..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

India Vs New Zealand 4th Odi Highlights: న్యూజిలాండ్ చేతిలో టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది. మౌంట్ మాంగనూయ్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఏకంగా 244 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది రెండో అతిపెద్ద ఓటమి. అంతేకాదు.. గత 26 ఏళ్లలో భారత్ ఇంత భారీ తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓపెనర్ విల్ యంగ్ (125) అద్భుతమైన సెంచరీతో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (58) హాఫ్ సెంచరీ బాదాడు. అనంతరం 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 89 పరుగులకే కుప్పకూలింది.

న్యూజిలాండ్ విధించిన 334 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు హెన్రీ వేసిన మొదటి ఓవర్‌లో భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ రోహిత్ శర్మ, ఐదో బంతి విరాట్ కోహ్లీ, ఆఖరి బంతికి శ్రేయస్ అయ్యర్ ఖాతా తెరవకుండానే ముగ్గరు పెవిలియన్‌కు వెళ్లిపోయారు. దీంతో సున్నాకే మూడు వికెట్లు పడ్డాయి. ఆ తరువాత రుతురాజ్ గైక్వాడ్ (5) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇషాన్ కిషన్ (27), అక్షర్ పటేల్ (21) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. భారీ స్కోర్లు చేయలేకపోయారు. నమన్ ధీర్ (21) కాసేపు క్రీజ్‌లో నిలిచాడు. కివీస్ బౌలర్ల ధాటికి 26.4 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాట్ హెన్నీ 26 పరుగులు ఇచ్చి.. 6 వికెట్లు తీశాడు. మ్యాథ్యూ ఫిషర్ 3 వికెట్లు తీయగా.. జేమిసన్ ఒక వికెట్ పడగొట్టాడు.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ విల్ యంగ్ శతకంతో చెలరేగాడు. 108 బంతుల్లో 125 పరుగులు చేసి భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. విల్ యంగ్‌కు వన్డేలలో ఇది ఐదో సెంచరీ. ఆరంభంలోనే విల్ యంగ్ ఇచ్చిన రెండుసార్లు క్యాచ్‌లు భారత ఫీల్డర్లు నేలపాలు చేశారు. మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ 48 బంతుల్లో 58 పరుగులతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 85 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఫిన్ అలెన్ 30 బంతుల్లో 41 పరుగులతో రాణించాడు.

ఒక దశలో న్యూజిలాండ్ 350 పరుగులు చేసేలా కనిపించినా..  ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. చివరి 13 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం 77 రన్స్ చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ తలో రెండు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, నమన్ ధీర్‌ చెరో వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు హెన్రీకి దక్కింది. ఈ ఓటమితో ఐదు వన్డేల సిరీస్‌లో 2-1కి భారత్ ఆధిక్యం తగ్గింది. ఇదే వేదికపై ఆఖరి మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సిరీస్ సొంతం అవుతుంది. కివీస్ గెలిస్తే సమం అవుతుంది. 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
Sports News
Telugu News