• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Oppo అభిమానులకు గుడ్ న్యూస్.. Reno 17, Pro, Reno 17c ఫోన్ల ఫీచర్లు లీక్!

Oppo అభిమానులకు గుడ్ న్యూస్.. Reno 17, Pro, Reno 17c ఫోన్ల ఫీచర్లు లీక్!

Oppo Reno 17 Series: త్వరలో భారత మార్కెట్‌లోకి ఒప్పో రెనో 17 సిరీస్‌ అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌పుల్‌ ఫీచర్స్‌తో లాంచ్‌ కాబోతోంది. అయితే, ఇందులో మూడు మోడల్స్‌లో అందుబాటులోకి రానుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 24, 2026, 11:17 AM IST|Updated: Oct 24, 2026, 11:19 AM IST
joinshare
Oppo అభిమానులకు గుడ్ న్యూస్.. Reno 17, Pro, Reno 17c ఫోన్ల ఫీచర్లు లీక్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Video Viral: పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

Video Viral: పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

2

నవంబర్ 2026 బ్యాంక్ సెలవుల జాబితా..వచ్చే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్‌?పూర్తి లిస్ట్ ఇదే!

3

తెలంగాణపై తుపాను ఎఫెక్ట్.. ఎల్లో అలర్ట్ జారీ..

4

Actress: కరుప్పు సినిమా నటి మృతి.. వైరల్‌గా చివరి పోస్టులు!

5

Oppo అభిమానులకు గుడ్ న్యూస్.. Reno 17, Pro, Reno 17c ఫోన్ల ఫీచర్లు లీక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Oppo Reno 17 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ ఒప్పో మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. దిమ్మతిరిగే ఫీచర్స్‌తో ఎప్పుడూ వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉంటుంది.  ఒప్పో నుంచి కొత్త సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే భారత మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఒప్పో రెనో 17 సిరీస్‌ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిని కంపెనీ మొదట వచ్చే నెలలో చైనాలో విడుదల చేసి.. ఆ తర్వాత భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, విడుదల కంటే ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లాంచ్‌ అయ్యాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఒప్పో రెనో 17 సిరీస్‌ను కంపెనీ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో విడుదలవ్వడం విశేషం.. టిప్‌స్టర్ దేబయన్ రాయ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ సిరీస్‌లోని స్టాండర్డ్ మోడల్‌తో పాటు, ఒప్పో రెనో 17c కూడా భారతదేశంలో విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు.. ఒప్పో రెనో 17 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఒప్పో రెనో 17c స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌లో మాత్రంలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ప్రాసెసర్‌ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఒప్పో రెనో 17 స్మార్ట్‌ఫోన్‌ థాయ్‌లాండ్ నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్ (NBTC) వెబ్‌సైట్‌లో CPH2975 మోడల్ నంబర్‌తో నమోదు చేసిన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ సిరీస్‌లో కొన్ని మోడల్స్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫోటోస్‌ కూడా లీక్‌ అయిన్నట్ల తెలుస్తోంది. ఒప్పో రెనో 17 ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో పాటు చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్‌తో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా యూనిట్‌లో మూడు కెమెరాలతో పాటు, చాలా స్పెషల్ LED ఫ్లాష్ లభిస్తోంది. ఒప్పో రెనో 17 సిరీస్ నవంబర్‌లో చైనా మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..

ఇందులోని అన్ని మోడల్స్‌ ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17తో ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ కాబోతున్నట్లు సమాచారం.. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ వచ్చే ఏడాది మొదటి నెలలో భారతదేశంలో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదలకు సంబంధించిన వివరాలను ఒప్పో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 17 ప్రో మోడల్‌ కూడా అందుబాటులోకి రాబోతోంది.. ఈ మోడల్‌ 6.32-అంగుళాల 1.5K ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో లభిస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News