Woman climbs mobile tower demanding marriage with lover in uttar Pradesh: ఇటీవల సమాజంలో చాలా మంది ప్రేమ పెళ్లిళ్లకే ఎక్కువగా మోగ్గుచూపుతున్నారు. కొన్ని రోజులపాటు డేటింగ్ లో ఉంటున్నారు. ఆతర్వాత వారి అభిప్రాయాలు ఒకటైతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. లేకుంటే బ్రేకప్ లు చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది పెద్దలను ఎదిరించి కూడా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తమ ప్రేమ పెళ్లిళ్లకు ఆత్మహత్యలకు కూడా వెనుకాడటంలేదు.
#बहराइच शादी की जिद में टावर पर चढ़ी नाबालिग। मोतीपुर के चौधरी गांव में मचा हड़कंप। सूचना पर पुलिस पहुंची, लड़की को समझाने में जुटी। सुरक्षित नीचे उतारने के प्रयास लगातार जारी। @bahraichpolice @DMBahraich #UPPolice #AnaadiTVUP #UPNews https://t.co/Ux2Uqv8i56
— Anaadi TV UP UK (@AnaadiTVUPUK) October 23, 2026
ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లోని బహరాయిచ్ గ్రామంలో సైదా అనే యువతి, నూరుద్దీన్ లు ప్రేమించుకున్నారు. అయితే నూరుద్దీన్ పఠాన్ వర్గానికి చెందిన వాడు కావడంతో ఇంట్లో వారు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఇంట్లో గొడవ పడి పెళ్లిచేసుకుంటే నూరుద్దీన్ ను మాత్రమే చేసుకుంటానని చెప్పి సైదా మోతీపూర్ పీఎస్ పరిధిలో ఉన్న సెల్ టవర్ ఎక్కింది. దీంతో స్థానికులు, యువతి కుటుంబ సభ్యులు సెల్ టవర్ వద్దకు చేరుకున్నారు.
తన ప్రియుడితో వీడియో కాల్ లో నిఖా చేస్తేనే కిందకు దిగుతానని లేకుంటే దూకేస్తానని బెదిరించింది. ఈ క్రమంలో ఇరుకుటుంబాలు మాట్లాడుకుని సైదాకు, ముంబైలో ఉన్నన నూరుద్దీన్ కు వాళ్ల మతాచారం ప్రకారం'ఖాజీ'ని పిలిపించి గ్రాండ్ గా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత యువతి సెల్ టవర్ నుంచి కూల్ గా కిందకు దిగింది. యువతి కోరిక కాదనకుండా.. ఇరు కుటుంబాలు తీసుకున్న నిర్ణయంపై పోలీసులు అభినందించారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.