SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మీ IRCTC వెయిటింగ్ లిస్ట్ 100 దాటిందా? కంగారు పడకండి.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో సీట్ కన్ఫర్మ్!

IRCTC Waiting List 100+: సాధారణంగా రైలు టిక్కెట్‌ బుక్‌ చేయాలంటే 60 రోజులు ముందు బుక్‌ చేయాలి. అయితే, పండుగ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో టిక్కెట్‌ కన్ఫామ్‌ అవ్వడం కూడా కష్టతరం అవుతుంది. ఆ స్టెప్‌ బై స్టెప్‌ ప్రక్రియ ఏంటి తెలుసుకుందాం..

Written By Renuka Godugu
Published: Oct 01, 2026, 03:01 PM IST | Updated: Oct 01, 2026, 03:05 PM IST
Image Credit: IRCTC Waiting List 100+
Join

భారతీయ రైల్వేలో ప్రయాణం ఎంతో సులభతరం. అయితే, రిజర్వేషన్‌ లేకుంటే ఎంతైనా కష్టతరం. కానీ, మీరు ఈ ఆప్షన్‌ ఎంచుకుంటే సులభంగా 100+ వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్నా కూడా మీ టిక్కెట్‌ కన్ఫామ్‌ అవుతుంది. ప్రతిరోజూ కొన్ని లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే, రోజూ రెండు నెలలకు ముందుగానే ఉదయం 8 గంటలకు టిక్కెట్‌లు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి రద్దీ ఎక్కువగా ఉంటే టిక్కెట్‌లు క్షణాల్లో మాయం అవుతాయి. అయితే, ఈజీగా రైలు ప్రయాణం చేయాలంటే మాత్రం సీటు ఉండాల్సిందే. అయితే, మీరు రైలు టిక్కెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ఈ ఆప్షన్‌ ఎంచుకుంటే టిక్కెట్‌ కన్ఫామ్‌ అవుతుంది.

ప్రస్తుతం పితృ పక్షం.. ఇది పూర్తైన వెంటనే నవరాత్రులు ప్రారంభమవుతాయి. పండుగల సమయంలో అయితే, సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం టిక్కెట్‌లు అస్సలు ఉండవు. దొరకడం కష్టతరం అవుతుంది. వెయిటింగ్‌ లిస్ట్‌ 100 కూడా దాటేస్తుంది.  ఒన్ని ముఖ్యమైన ట్రైన్‌లు అయితే, కొన్ని స్టాపుల్లో Regret అని ఉంటుంది. ఇది వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ల కోసం ఇలా బ్లాక్‌ చేస్తారు.

మీ సీట్‌ కన్ఫామ్‌ కావాలంటే మీరు ఎక్కబోయే స్టేషన్‌ మాత్రమే కాదు. ఆ చుట్టు ముట్టు ఆగే స్టేషన్‌లో కూడా ఒకసారి చెక్‌ చేయండి. ఒక వేళ రైలు మీ స్టేషన్‌కు వచ్చే సరికి నిండిపోతే మీ పక్కనే ఉన్న మరో స్టేషన్‌ నుంచి బుక్‌ చేయడానికి ప్రయత్నించండి.

దసరా, దీపావళి సందర్భంగా భారతీయ రైల్వే మొత్తం 100 పైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.  ప్రధానంగా యూపీ, బిహార్‌కు వెళ్లే రూట్‌లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రూట్‌లో అదనంగా ట్రైన్‌లను నడుపుతుంది. దీనివల్ల మీ టిక్కెట్‌ కూడా కన్ఫామ్‌ అవుతుంది.

అయితే, టిక్కెట్‌ కన్పామ్‌ అనేది మీ వెయిట్‌ లిస్ట్‌ కేటగిరీపై కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణ వెయిటింగ్‌ లిస్ట్‌ (GNWL) చెందినవి త్వరగా కన్ఫామ్ అవుతాయి. రిమోట్‌ లొకేషన్‌ (RLWL) ఎక్కువ సమయం తీసుకుంటాయి. పూల్డ్‌ కోటా (PQWL) అయితే, చివరగా క్లియర్‌ అవుతాయి. GNWL 100 టిక్కెట్స్‌ PQWL15 కంటే కూడా త్వరగా కన్పామ్‌ అవుతాయి. ఎందుకంటే సాధారణంగా రైల్వే ఎక్కువగా డిమాండ్‌ ఉండే రైళ్లకు అదనంగా కోచ్‌లను జత చేస్తుంది. ప్రధానంగా రద్దీ అదనంగా ఉండే వెయిటింగ్‌ లిస్ట్‌ వారి కోసం అదనంగా కోచ్‌లను జత చేసి కన్ఫామ్‌ చేస్తుంది.

ఇక ఐఆర్‌సీటీసీలో మీరు టిక్కెట్‌ బుక్‌ చేస్తే 'VIKALP' ఆప్షన్‌ టిక్కెట్‌ బుక్‌ చేసే సమయంలో ఎంచుకోవాలి. దీనివల్ల ఆటోమెటిగ్గా వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌లు కూడా కన్ఫామ్‌ అయిపోతాయి. ఇది అదే రూట్‌లో వెళ్లే ఇతర ట్రైన్‌లకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా టిక్కెట్‌లు బదిలి అవుతాయి.

Read Also: రైలు ప్రయాణికులు జాగ్రత్త! ఐడీ జిరాక్స్, ఫోన్‌లో చూపిస్తే సరిపోదు.. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్ తప్పనిసరి!

మీరు టిక్కెట్‌ కొనుగోలు చేసే ముందే టిక్కెట్‌ కన్ఫర్మేషన్‌ ప్రొబబిలిటీ టూల్‌ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ఆధారంగా చె్‌ చేయాలి. డిమాండ్‌ హై లేదా తక్కువ ఉందా? తెలుస్తుంది. దీంతో ఇతర ట్రైన్‌లో అయినా టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

ఇక పండుగల సమయంలో అయితే, మీరు రైలు ప్రయాణం చేస్తే సరైన ప్లాన్‌ ఉంటేనే అవుతుంది. VIKALP, ట్రాకింగ్‌ కోటా టైప్‌, ప్రత్యేక రైళ్ల ప్రకటన, మీ పక్క స్టేషన్‌ సీట్ల లభ్యత చెక్‌ చేస్తూ ఉండాలి. దీనివల్ల చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉంటాయి.  

Add Zee News as a Preferred Source

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES