SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దొంగతనం చేసి దర్జాగా వెళ్లిపోయింది.. 24 గంటల్లో తిరిగి ఇచ్చేసి గుంజీలు తీసింది.. ఎందుకంటే..!

Rajasthan Viral News: వెండిగాజులు దొంగతనం చేసిన ఓ మహిళ.. వాటిని ఏం చేయకుండా తిరిగి షాపు ఓనర్‌కు ఇచ్చేసింది. తాను తప్పు చేశానంటూ గుంజీలు తీసి మరీ క్షమాపణలు చెప్పింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.

Written By Ashok Krindinti
Published: Nov 21, 2026, 16:12 IST | Updated: Nov 21, 2026, 16:14 IST
Image Credit: Woman Returns Stolen Jewellery
Join

Rajasthan Viral News: దొంగతనం చేసిన తరువాత ఏం చేస్తారు..? చోరీ చేసిన సొమ్మును ఎక్కడో ఒక చోట ఆమ్మేసుకుని.. డబ్బులు తీసుకుని పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతారు. కానీ రాజస్థాన్‌లో ఓ మహిళ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. నగల దుకాణంలో వెండి గాజులు దొంగిలించిన ఆమె.. మళ్లీ వెనక్కి తిరిగి ఆ షాపు ఓనర్‌కు ఇచ్చేసింది. అంతేకాదు అందరి ముందు గుంజీలు తీస్తూ క్షమాపణలు చెప్పింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ మహిళ ఎందుకు దొంగతనం చేసిన గాజులను తిరిగి వెనక్కి ఇచ్చింది..? తన సొత్తును తన వద్దకు తెప్పించుకునేందుకు ఆ షాప్ ఓనర్ ఏం చేశాడు..? వివరాలు ఇలా..

రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా రేన్వాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న నగల దుకాణానికి ఓ మహిళ కస్టమర్‌లా వెళ్లింది. నగలు చూస్తున్నట్లు నటిస్తూ.. అదును కోసం ఎదురుచూసింది. ఈ క్రమంలో దుకాణంలో ఉన్న వెండి గాజులను ఎవరికీ అనుమానం రాకుండా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఆమె చేసిన పని మొత్తం రికార్డయింది. ఫుటేజీని పరిశీలించిన దుకాణ యజమాని.. మహిళే గాజులను తీసుకెళ్లినట్లు గుర్తించారు.

గాజులు కనిపించకపోవడంతో దుకాణదారుడు పోలీసులను ఆశ్రయించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా చేసుకుని మహిళకు విజ్ఞప్తి చేశాడు. దొంగిలించిన వెండి గాజులను తన తిరిగి ఇవ్వాలని కోరాడు. ఇందుకోసం 24 గంటల గడువు కూడా విధించాడు. దుకాణదారుడు చేసిన ఈ విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు ఆ మహిళ కూడా ఈ వీడియోను చూసి స్పందించింది. దొంగిలించిన గాజులను తీసుకుని తిరిగి అదే ఆ షాపు ఓనర్‌కు ఇచ్చేసింది. అంతేకాదు.. తన తప్పును అంగీకరిస్తూ ఆయన ఎదుట గుంజీలు తీసింది. మరోసారి ఇలాంటి పని చేయనంటూ క్షమాపణలు చెప్పింది. ఆమె క్షమాపణలు చెప్పిన వీడియో కూడా వైరల్ అవుతోంది. దొంగతనం చేసిన మహిళే తిరిగి వచ్చి నగలను అప్పగించడం.. అందరి ముందు క్షమాపణలు చెప్పడం స్థానికంగా చర్చనీయాంశమైంది.  
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES