SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్య.. CRPF క్యాంప్ పై దాడి..!!

Jammu and Kashmir: జమ్ము కాశ్మీర్ లోని కుల్గామ్ లో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంప్ పై టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. భద్రతా దళాలు దాడులను తిప్పికొడుతున్నాయి.

Written By Bhoomi
Published: Nov 11, 2026, 03:05 PM IST | Updated: Nov 11, 2026, 03:07 PM IST
Image Credit: Jammu and Kashmir
Join

Jammu and Kashmir:  జమ్ము కాశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. బుధవారం స్థానిక భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి తీవ్ర కలకలం రేపింది. కుల్గామ్ లోని ఒక సీఆర్పీఎస్ చెక్ పోస్టును లక్ష్యంగా చేసుకుని మోటార్ సైకిళ్లపై వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ అనూహ్య దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రవాదులు కాల్పులు జరిపిన వెంటనే అలర్ట్ అయిన సీఆర్పీఎఫ్ బలగాలు అంతే ధీటుగా ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే క్విక్ రియాక్షన్ టీమ్స్ హుటా హుటినా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని.. పరారైన ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని..  పరారైన ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ దాడికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES