JCB డ్రైవింగ్ నచ్చిందని.. ప్రేమించి.. పెళ్లి చేసుకుంది ఓ యువతి!
Jcb Driver Love Story: ఇంటి పనుల కోసం JCBని పిలిపించారు.. అయితే, దానితో పాటు ఒక యువకుడు డ్రైవర్‌గా వచ్చారు.. ఆ యువకుడు స్టీరింగ్ తిప్పడం నచ్చిందని ఓ యువతి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Jcb Driver Love Story: ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మధ్య ఎలా చిగురిస్తుందో ఊహించడం చాలా కష్టం.. దానికి కులాలతో పాటు మతాలు మాత్రమే కాదు.. వృత్తులు, హోదాలు కూడా అడ్డుకావని మరోసారి నిరూపించింది కేరళకు చెందిన ఓ జంట... ఇంటిని కడుతున్న సమయంలో జేసీబీ నడుపుతున్న యువకుడి సనిని ఇష్టపడి.. ఓ యువతి, అతడితో ప్రేమలో పడి చివరకు వివాహం చేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. అయితే, లవ్ స్టోరీకి సంబంధించిన అన్ని వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కేరళకు సంబంధించిన నస్రియా రెహమాన్ అనే ముస్లిం యువతి ఇంట్లో కొన్ని రోజుల క్రితం నిర్మాణ పనులు మొదలయ్యాయి.. ఆ పనుల్లో భాగంగా మట్టి తవ్వకాలతో పాటు చదును చేసేందుకు మిథున్ అనే హిందూ యువకుడు JCB ఆపరేటర్‌గా అక్కడికి వెళ్లాడు.. భారీ యంత్రాన్ని అతడు ఎంతో అద్భుతంగా, సులభంగా నడుపుతున్న విధానం నస్రియాను ఎంతగానో ఆకట్టుకుందట.. అంతే ఇక మనుసు పారేసుకుంట..
సాధారణంగా సినిమాల్లోనో.. కథల్లోనో వినే సన్నివేశంలా.. భారీ JCB శబ్దం మధ్య వారి పరిచయం మొదలైందట.. క్రమంగా మాటలు కలవడంతో పాటు ఒకరి ఆలోచనలు మరొకరికి నచ్చడంతో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిపోయిందట.. వృత్తి పట్ల అతడికున్న నిబద్ధత నస్రియాను బలంగా ఆకర్షించాయట..
కొంతకాలం కొనసాగిన వీరి ప్రేమాయణం.. చివరకు పెళ్లి పిట్టాలెక్కారు.. మతాలు వేరైనా.. పరస్పర ప్రేమాభిమానాలే ముఖ్యమని భావించిన ఈ జంట.. జీవితాంతం కలిసి నడవాలని నిర్ణయించుకుంది.. ఇరువైపులా ఉన్న వ్యత్యాసాలను లెక్కచేయకుండా.. స్థానిక ఆలయంలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు..
ఈ అరుదైన ప్రేమకథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. పనితనాన్ని చూసి ప్రేమించడం నిజమైన ప్రేమకు నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రేమకు భాషలు, హద్దులు లేవంటారు.. కానీ ఇలా జేసీబీ స్టీరింగ్ ప్రేమకు ఒక చిహ్నంగా మారుతందని ఎవరూ అనుకోలేరని కామెంట్లు పెడుతూ వస్తున్నారు.