SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kerala: కేరళలో రోడ్డెక్కిన టీచర్ అభ్యర్థులు.. గుండు గీయించుకుని మరీ నిరసన.. వీడియో వైరల్..

Kerala lpst woman protest: ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తు ఆల్ కేరళ లోయర్ ప్రైమరీ స్కూల్ టీచర్ (LPST) ర్యాంక్ హోల్డర్స్ అసోసియేషన్ కార్యదర్శి వలర్మతి ఎస్. గుండు గీయించుకుని మరీ తమ నిరసనల్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన కేరళలో రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 27, 2026, 02:33 PM IST | Updated: Oct 27, 2026, 02:41 PM IST
Image Credit: kerala LPST Teacher protest
Join

Keralam lower primary Teacher rank holder shaves head video: మన సమాజంలో గురువులకు ఎంతో విశిష్టస్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువులకు ఆ  ఉన్నత  స్థానం ఇచ్చారు. చాలా మంది టీచర్లు స్కూళ్లలో పాఠాలతో పాటు, జీవిత పాఠాలు కూడా చెబుతుంటారు. ఎంతో అంకిత భావంతో విద్యాబోధన చేస్తారు. అయితే.. అలాంటి ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారు ఇటీవల పలు రాష్ట్రాల్లో సమస్యల్నిఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేరళలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తిరువనంతపురంలోని సెక్రెటెరియట్ వద్ద నిరసనలకు దిగారు.

 

 


కేరళలోని తిరువనంతపురంలో  నిరుద్యోగ టీచర్  అభ్యర్థులు నిరసనలకు దిగారు. వీరంతా 
కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC)తో.. లోయర్ ప్రైమరీ స్కూల్ టీచర్ (LPST) ఉద్యోగ  భర్తీపై
జరుగుతున్న ఆలస్యంకు తీవ్ర నిరసనలకు దిగారు. ఈక్రమంలో ఆల్ కేరళ LPST ర్యాంక్ హోల్డర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. వలర్మతి ఈ కార్యక్రమంలో గుండు గీసుకొని మరీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. 

అంతే కాకుండా ఉపాధ్యాయ అభ్యర్థులతో కలిసి ఆమరణ నిరాహర  దీక్షను సైతం చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే టీచర్ పోస్టుల భర్తీకి పరీక్షలు రాసి, అధికారిక ర్యాంక్ లిస్టులో అర్హత సాధించినప్పటికీ ప్రభుత్వం నియామక ఉత్తర్వుల జారీపై ఆలస్యం చేయడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన  రాక పోవడంతో ఏకంగా రోడ్డుపై గుండు గీయించుకునిమరీ టీచర్ అభ్యర్థి నిరసనలకు దిగడం కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా  మారింది.

గతంలో ప్రభుత్వం ఇచ్చిన హమీలను మాత్రమే తాము అడుతున్నామని టీచర్  ర్యాంకు హోల్డర్ లు ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో తమ డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పిన కేరళ సర్కారు మాటతప్పిందంటూ టీచర్ అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షంలో సైతం నిరసననలు చేస్తున్న ప్రభుత్వం నుంచి కనీసం రెస్పాన్స్ రాకపోవడం దారుణమన్నారు. ఈక్రమంలో టీచర్ అభ్యర్థులు పలు డిమాండ్ లను ప్రభుత్వం ముందు ఉంచారు.

విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని 1:25కు తగ్గించడం, ప్రధానోపాధ్యాయుల ఖాళీలను (HTV) PSC పరిధిలోకి చేర్చడం, తమ టీచర్ ర్యాంకు లిస్ట్ చెల్లుబాటును పొడిగించడం, ఈ భర్తీ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్ ను వాయిదా వేయాలని పలు డిమాండ్ లను కేరళ ప్రభుత్వంముందు నిరసన తెలియజేస్తున్న టీచర్లు ఉంచారు.


సెప్టెంబర్ 30న మంత్రితో జరిగిన సమావేశంలో, నిరసనలు విరమించుకున్న తర్వాత తమ డిమాండ్లను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని అధికారులు చెప్పారని వలర్మతి TNIEకి తెలిపారు. మరోవైపు నీట్ పేపర్ లీక్, జెన్ జీల సమస్యలపై ఢిల్లీలో పోరాటం మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కేరళ వలర్మతి విషయంలో ఎందుకు స్పందించడంలేదని రాజకీయ దుమారం చెలరేగింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES