• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Ind Vs NZ Highlights: అభిషేక్ శర్మ రుద్రతాండవం.. కివీస్‌పై అర్నబ్‌ తుఫాన్‌ను మించి భారత్ బీభత్సం..!

Ind Vs NZ Highlights: అభిషేక్ శర్మ రుద్రతాండవం.. కివీస్‌పై అర్నబ్‌ తుఫాన్‌ను మించి భారత్ బీభత్సం..!

India vs New Zealand Highlights: మూడో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్ల విధ్వంసంతో న్యూజిలాండ్‌ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదడంతో భారత్ 6 వికెట్ల తేడాతో కివీస్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్ 3-0తో కైవసం చేసుకుంది.

Written ByAshok Krindinti
Published: Oct 27, 2026, 04:01 PM IST|Updated: Oct 27, 2026, 04:17 PM IST
joinshare
Ind Vs NZ Highlights: అభిషేక్ శర్మ రుద్రతాండవం.. కివీస్‌పై అర్నబ్‌ తుఫాన్‌ను మించి భారత్ బీభత్సం..!
Image Credit: India vs New Zealand 3rd T20 Highlights (Source: BCCI/X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Ind Vs NZ Highlights: అభిషేక్ శర్మ రుద్రతాండవం.. కివీస్‌పై అర్నబ్‌ తుఫాన్‌ను మించి భారత్ బీభత్సం..!

Ind Vs NZ Highlights: అభిషేక్ శర్మ రుద్రతాండవం.. కివీస్‌పై అర్నబ్‌ తుఫాన్‌ను మించి భారత్ బీభత్సం..!

2

CM Chandrababu naidu: దూసుకొస్తున్న అర్నబ్ తుపాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం.!.

3

ఆధార్ వినియోగదారులకు మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్.. గత 6 నెలల్లో ఎక్కడెక్కడ వాడారో చెక్ చేసే సింపుల్ ట్రిక్!

4

అర్హులైన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలి: TSCPSEU రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్

5

Hyderabad: చెవుల్లో ఇయర్‌ఫోన్లు.. వేగంగా దూసుకొచ్చి వ్యక్తిని ఢీకొన్న రైలు.. షాకింగ్ వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

India vs New Zealand 3rd T20 Highlights: న్యూజిలాండ్‌పై మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు పెను విధ్వంసం సృష్టించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ కివీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఊచకోత కోశాడు. కేవలం 35 బంతుల్లోనే మెరుపు శతకం బాది రికార్డు సృష్టించాడు. అభిషేక్‌కు తోడు యువ సంచలన వైభవ్ సూర్యవంశీ (45) చెలరేగడంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెల్లింగ్టన్ రీజినల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ 3-0 తేడాతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.

ముందుగా టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు కివీస్‌కు ఆరంభంలోనే రూపంలో షాక్ తగిలింది. ఓపెనర్ సీఫర్ట్ (2)ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. అనంతరం డారిల్ మిచెల్ 52 బంతుల్లో 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ అలెన్ (40), జాకబ్స్ (39) రాణించారు. సూపర్ ఫామ్‌లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్‌ (17)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. మొదటి 10 ఓవర్లలో 100 పరుగులు న్యూజిలాండ్.. ఆ తర్వాతి 10 ఓవర్లలో 98 రన్స్ చేసింది. ఓ దశలో న్యూజిలాండ్ స్కోరు 13 ఓవర్లలో 135 పరుగులకు చేరుకున్న కివీస్.. ఆ దశలో అలవోకగా 220 పరుగుల మార్కును దాటేలా కనిపించింది. అయితే డెత్ ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకున్నారు. కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులతో చివరి ఓవర్లలో కివీస్ బ్యాటర్లను భారీ షాట్లు ఆడకుండా కట్టడి చేయగలిగారు. దీంతో స్కోరు వేగానికి కొంత మేర బ్రేకులు పడ్డాయి. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా.. నితీష్ 4 ఓవర్లలో 38 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. భువనేశ్వర్, ప్రిన్స్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఊహించని రీతిలో ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్ నుంచే వీరిద్దరు కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ గ్రౌండ్ నలువైపులా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో భారత్ 2.2 ఓవర్లలో 50 పరుగుల మార్క్‌ను చేరుకుంది. వంద పరుగుల స్కోరును కేవలం ఐదు ఓవర్లలో చేసింది. 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్.. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 11 భారీ సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి ఔటయ్యాడు. సంజు శాంసన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్‌ కూడా చెలరేగి ఆడాడు. 19 బంతుల్లో 45 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. విజయానికి చేరువగా ఉన్న సమయంలో శ్రేయస్ అయ్యర్ (5), సంజు శాంసన్ (18) ఔట్ అయ్యారు. నమన్ ధీర్ ఫోర్‌తో విన్నింగ్ షాట్ కొట్టాడు.

భారత్ తరుఫున టీ20ల్లో వేగవంతమైన సెంచరీ బాదిన రోహిత్ శర్మ (35 బంతుల్లో) రికార్డును అభిశర్మ శర్మ సమం చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అభిషేక్ శర్మకు ఇది నాలుగో సెంచరీ. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును అభిషేక్‌ శర్మనే వరించింది. నాలుగో టీ20 మ్యాచ్‌ శుక్రవారం జరగనుంది.  

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News
Cricket