SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చీకట్లో మెరుస్తున్న నాగమణి.. చుట్టూ కింగ్ కోబ్రా కాపలా.. వీడియో ఇదే!

Nagamani Viral Video: తాజాగా నాగమణికి ఓ ప్రమాదకరమైన కింగ్‌కోబ్రా కాపాలగా ఉన్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ వీడియోను చూసి ఇలాంటి మణులు కూడా ఉంటాయా? అని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో మాత్రం ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 16, 2026, 03:01 PM IST | Updated: Oct 16, 2026, 03:03 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Nagamani Viral Video: సోషల్ మీడియాల్లో ఎన్నో రకాల వింతైన, అరుదైన విషయాలు రోజు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో తెగ హల్‌చల్ అవుతోంది. అత్యంత ప్రమాదకరమైన నాగుపాముకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పురాణాలతో పాటు సినిమాలలో మాత్రమే.. చూస్తున్నామనుకునే అత్యంత అరుదైన నాగమణికి ఓ పాము ప్రత్యక్షంగా కాపాలా కాస్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే, ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. అత్యంత విషపూరితమైన ఓ కింగ్‌ కోబ్రా చీకటి ప్రదేశంలో అత్యంత కోపంగా పడగ విప్పి కూర్చుని ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ పాము కదలికలు చాలా వింతగా ఉండడం మీరు క్లియర్‌గా చూడోచ్చు.. దాని పడగ పైభాగం నుంచి కిందకు జారిన ఓ నాగమణి కాంతివంతంగా మెరవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మణి చుట్టూ ఎలాంటి వెలుతురు లేకపోయినా.. దాని కాంతితో అది ప్రకాశిస్తుండటం ఆశ్యర్యం కలిగిస్తోంది..

అంతేకాకుండా.. ఆ విలువైన మణికి ఏమాత్రం ప్రమాదం కలగకుండా... దాని చుట్టూనే చుట్టుకుని పాము కాపాలా కాస్తున్న తీరు అందరినీ అశ్యర్యం కలిగించేలా చేస్తోంది.. ఆ పాము చూపులు.. దాని ఆగ్రహం చూస్తుంటే ఎవరైనా దాని దగ్గరికి వెళ్లడానికి వణికిపోవాల్సిందే అన్నట్లు అనిపోస్తోంది. ఈ సమయంలో ఆ పాము దగ్గరకు వెళ్తే తప్పకుండా.. అది కాటేసే అవకాశాలు కూడా ఉన్నాయి..

పాములు మణులను రక్షించే ఒక వింత.. మన దేశంలో ప్రాచీనకాలం నుంచి ఉందని సమాచారం. అయితే, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ.. కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూసి సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమైన మణేనా?.. లేక విజువల్ ఎఫెక్టా? అంటూ కొందరు కామెంట్లు కూడా పెడుతూ వస్తున్నారు. మరికొందరు ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉంటాయని  కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. ప్రస్తుతం ఈ అరుదైన కింగ్‌కోబ్రాకు సంబంధించిన వీడియో ఊహించని స్థాయిలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES