Tollywood New Trend: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు మిస్టరీ నేపథ్యంలో కాస్త థ్రిల్లింగ్ అంశాలతో కూడిన సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ‘విరూపాక్ష’తో సంచలనం సృష్టించిన కార్తీక్ దండు.. నాగ చైతన్యతో ‘వృషకర్మ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా మిస్టికల్ థ్రిల్లర్. ఈ కథలో దేవుడి చుట్టూ తిరిగే అంశాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక ‘శంబాలా’లో దేవుడి చుట్టూ తిరిగే కథతో హిట్ కొట్టాడ ఆది సాయికుమార్. ఆ తరవ్ాత అలాంటి మిస్టిక్ థ్రిల్లరే చేయబోతున్నారు. నవరసన్ దీనికి దర్శకుడు.
క ఫేమ్ సుజీత్-సందీప్ దర్శక ద్వయంతో సాయిధరమ్ తేజ్ చేయబోయే సినిమా కూడా మైండ్ బ్లాక్ అయ్యే మిస్టికల్ థ్రిల్లర్ అనే తెలుస్తుంది. ఇందులో తేజు ఒక డీప్ మిస్టరీని ఛేదించే ఫాంటసీ రోల్లో కనిపించబోతున్నారు. చిరంజీవి హీరోగా నటించిన ‘విశ్వంభర’ సైతం సోషియో ఫాంటసీకి మైథాలజీ టచ్ యాడ్ చేసిన భారీ మిస్టికల్ అడ్వెంచరే. 14 లోకాల మిస్టరీ ఈ సినిమాలో ఉంది.
రామ్ చరణ్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా వస్తున్న ది ఇండియా హౌజ్ కూడా ఇదే తరహా థ్రిల్లర్ జోనర్లోనే వస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా వస్తున్న ఈ హిస్టారికల్ థ్రిల్లర్లో.. నిఖిల్ చేయబోయే అన్వేషణ ఆడియన్స్కు పూనకాలు పుట్టించేలా ఉండబోతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. మొత్తంగా సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు అందరు మిస్టిక్ థ్రిల్లర్ వైపు అడుగులు వేస్తున్నారు.