Leopard entered a house and attacks on dog in Uttarakhand: ఇటీవల అడవిలోని క్రూర జంతువులు తరచుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఏనుగులు, చిరుత పులులు, పాములు, ఎలుగు బంట్లు, కొండ చిలువలు అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి వచ్చి ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్న కూడా చిరుతలు రాత్రిపూట మాటు వేసి మరీ పెంపుడు జంతువులపై దాడులు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా.. ఉత్తరాఖండ్ లో ఒక చిరుత పులి ఏకంగా రుద్రపప్రయాగ్ లోని ఇంట్లోకి ప్రవేశించి పెంపుడు శునకంపై దాడి చేసింది.ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Leopard in your bathroom! 😱🐆 This leopard walked into a home and dragged a pet dog into the washroom in Sumadi market Rudraprayag .The family locked it inside until officials arrived. Rising human-wildlife conflict in Uttarakhand in recent years is a growing concern. #Rudraprayag #Uttarakhand https://t.co/lxWnb7s8Uq
— Mohan Pargaien IFS🇮🇳 (@pargaien) November 15, 2026
ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా సుమాడిలో ఒక చిరుత ప్రవేశించి పెంపుడు శునకంపై దాడి చేసింది.ఆతర్వాత పక్కన ఉన్న వాష్ రూమ్ లోకి కుక్కలను లాక్కెళ్లిపోయమింది. దీంతో ఇంట్లో వారు అప్రమత్తమై చిరుతను గమనించి వెంటనే బైట నుంచి డోర్ ను లాక్ చేశారు. ఆతర్వాత ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు.వెంటనే ఫారెస్ట్ సిబ్బంది అక్కడకు చేరుకుని చాకచక్యంగా చిరుతను బంధించారు.
అయితే.. అకస్మాత్తుగా చిరుత వచ్చిన కూడా ఇంట్లోని వారు భయపడకుండా చూపించిన సమయస్పూర్తికి, ధైర్యసాహాసాలకు ఫారెస్ట్ సిబ్బంది ప్రశంసలు కురిపించారు. మొత్తంగా పెద్ద ప్రమాదం తప్పిపోవండంతో ఇంట్లోని వారు సైతం హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు. చిరుల పులుల సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. రాత్రిపూట గుంపులుగా వెళ్లాలని, డోర్ లను లాక్ చేసుకుని ఇంట్లోనే ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.