SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వామ్మె.. ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక్కసారిగా చిరుత ఎంట్రీ.. ఏం చేశారో చూడండి!

Leopard Video: టీవీ చూస్తున్న దంపతులిద్దరికీ చిరుపులి షాక్‌ ఇచ్చింది.. నేరుగా ఇంట్లోకి ప్రవేశించడంతో వారు అక్కడి నుంచి బయటి వచ్చి.. చిరుత పులిని లోపల ఉంచి.. తలుపులు పెట్టేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 13, 2026, 11:46 AM IST | Updated: Nov 13, 2026, 11:48 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Leopard Video Viral: ప్రశాంతంగా సాగిపోతున్న ఆ రాత్రి.. ఒక్కసారిగా ఆ దంపతులిద్దరికీ.. మృత్యువును కళ్లముందు కనిపించింది... కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో జరిగిన ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతూ వస్తోంది.. ఇంట్లో హాయిగా కూర్చుని.. TV చూస్తున్న భార్యాభర్తల దగ్గరికి ఒక్కసారిగా ఒక చిరుతపులి వచ్చింది.. దీంతో వారు ఒక్కసారిగా భయాందోళనుకు గురైట్లు తెలస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

తుమకూరు జిల్లాలోని బండిగౌడనపల్య గ్రామానికి చెందిన చిక్కమరియప్ప, నరసమ్మ దంపతులు రాత్రి సమయంలో తమ ఇంట్లో కూర్చుని.. టీవీ చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో.. ఇంటి బయట కట్టేసి ఉన్న ఒక మేకను వేటాడిన చిరుతపులి.. ఆ తర్వాత తలుపులు తెరిచి ఉండడంతో నేరుగా ఇంటి లోపలికి వచ్చేసింది.

తమ కళ్లముందే.. చిరుత ప్రత్యక్షమవడంతో ఆ దంపతులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారట.. ఊహించని ఈ పరిణామంతో నరసమ్మ తీవ్ర భయాందోళనకు గురై.. అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోయారట... అయితే, చిక్కమరియప్ప ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. పడిపోయిన తన భార్యను వెంటనే బయటకు తీసుకొచ్చి.. చిరుతపులి బయటకు రాకుండా ఇంటి తలుపులకు బయటి నుంచి వేసి గడియ పెట్టేశారట.. వారి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని.. వెంటనే పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారట..

సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది హుటాహుటిన అక్కడి చేరుకున్నారు.. ఇంట్లో బంధించిన చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక బోను, వలలను ఏర్పాటు చేశారట... సుమారు ఆరు గంటల పాటు శ్రమించి.. అటవీ అధికారులు ఆ చిరుతపులిని ఎట్టకేలకు బంధించడంతో గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారట.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు షాక్‌ అయిపోతున్నారు..
 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES