LPG Cylinder Price Hike: సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీన డొమెస్టిక్ లేదా కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల సవరణ జరుగుతుంది. ఈరోజు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. దీనివల్ల ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ. 62.50 పెరిగి, ప్రస్తుతం రూ. 2,810 అయ్యింది. పండుగ సీజన్ సమయంలో గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్ల నుండి స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల వరకు అందరికీ ఇది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. సెప్టెంబర్‌లో ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను రూ. 2747.50 ను రూ.9.50 పైసలు పెంచిన తర్వాత, ఇప్పుడు ఈ తాజా పెంపు జరిగింది.
కొత్త నెల ప్రారంభంలో ద్రవ్యోల్బణం నేపథ్యంలో ధరల సవరణ జరుగుతుంది. ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్, కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ ధరలతోపాటు ఏటీఎఫ్ ధరలను కూడా సవరిస్తుంది. అయితే, ఇప్పటివరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.. కాబట్టి వాటి ధరలు స్థిరంగా ఉన్నాయని చెప్పవచ్చు. కానీ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా అన్నీ ప్రాంతాల్లో పెరుగుదల కనిపించింది. గరిష్టంగా అయితే, పాట్నాలో రూ.71.50 పైసలు పెరిగాయి.
ఈ ధరల పెంపు దేశవ్యాప్తంగా ఉన్న వాణిజ్య సిలిండర్ ధరలపై ప్రభావం చూపుతుంది. సామాన్యులకు ఇది ఊరటనిస్తుంది. ఎందుకంటే డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు.. కానీ, రెస్టారెంట్లు, హోటళ్లు, వీధి వ్యాపారస్థులకు మాత్రం ఇది భారంగా మారుతుంది. పండుగ సమయానికి ముందే ధరలను భారీగా పెంచడం వల్ల వారి వ్యాపారాలపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 942 ఉండగా, ముంబైలో రూ.941, చెన్నైలో రూ.957, పాట్నాలో రూ.1031, లక్నోలో రూ.979 , హైదరాబాద్‌లో రూ.994 ఉన్నాయి.
ఈరోజు ఆయిల్ కంపెనీలు పెంచిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలో నేపథ్యంలో తాజాగా దేశవ్యాప్తంగా వాటి ధరలు ముంబైలో రూ.63 పెరిగి రూ.2764 చేరుకుంది. చెన్నైలో రూ.66.50 పెరిగి రూ.2916.50 నుంచి రూ.2983 పెరిగింది. పాట్నాలో రూ.3100 కు చేరుకుంది. దేశంలోనే ఈ ప్రాంతంలో అత్యధికంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.71.50 పెరిగింది. లేహ్ ప్రాంతంలో అయితే, ఏకంగా 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.3450 కు చేరింది.