SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పండుగ ముందు ఆయిల్ కంపెనీల మైండ్ బ్లాకింగ్ షాక్.. రూ. 62కి పైగా సిలిండర్‌ ధర పెరుగుదల!

దసరా పండుగ ముందే ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కేజీల సిలిండర్ ధర రూ.62.50 పెరగడంతో, ఢిల్లీలో దీని ధర రూ. 2,810 కి చేరుకుంది. పండుగ సీజన్ ముందే ధరలు పెరగడం వల్ల హోటల్, రెస్టారెంట్లకు ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు.

Written By Renuka Godugu
Published: Oct 01, 2026, 07:40 AM IST | Updated: Oct 01, 2026, 09:47 AM IST
Image Credit: LPG Cylinder Price Hike
Join

LPG Cylinder Price Hike: సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీన డొమెస్టిక్ లేదా కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల సవరణ జరుగుతుంది. ఈరోజు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. దీనివల్ల ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ. 62.50 పెరిగి, ప్రస్తుతం రూ. 2,810 అయ్యింది. పండుగ సీజన్ సమయంలో గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్ల నుండి స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల వరకు అందరికీ ఇది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. సెప్టెంబర్‌లో ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను రూ. 2747.50 ను రూ.9.50 పైసలు పెంచిన తర్వాత, ఇప్పుడు ఈ తాజా పెంపు జరిగింది.

కొత్త నెల ప్రారంభంలో ద్రవ్యోల్బణం నేపథ్యంలో ధరల సవరణ జరుగుతుంది. ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్‌, కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలతోపాటు ఏటీఎఫ్‌ ధరలను కూడా సవరిస్తుంది. అయితే, ఇప్పటివరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.. కాబట్టి వాటి ధరలు స్థిరంగా ఉన్నాయని చెప్పవచ్చు. కానీ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా అన్నీ ప్రాంతాల్లో పెరుగుదల కనిపించింది. గరిష్టంగా అయితే, పాట్నాలో రూ.71.50 పైసలు పెరిగాయి.

ఈ ధరల పెంపు దేశవ్యాప్తంగా ఉన్న వాణిజ్య సిలిండర్ ధరలపై ప్రభావం చూపుతుంది. సామాన్యులకు ఇది ఊరటనిస్తుంది. ఎందుకంటే డొమెస్టిక్‌ గ్యాస్‌ ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు.. కానీ, రెస్టారెంట్లు, హోటళ్లు, వీధి వ్యాపారస్థులకు మాత్రం ఇది భారంగా మారుతుంది. పండుగ సమయానికి ముందే ధరలను భారీగా పెంచడం వల్ల వారి వ్యాపారాలపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 942  ఉండగా, ముంబైలో రూ.941, చెన్నైలో రూ.957, పాట్నాలో రూ.1031, లక్నోలో రూ.979 , హైదరాబాద్‌లో రూ.994 ఉన్నాయి.

ఈరోజు ఆయిల్‌ కంపెనీలు పెంచిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలో నేపథ్యంలో తాజాగా దేశవ్యాప్తంగా వాటి ధరలు ముంబైలో రూ.63 పెరిగి రూ.2764 చేరుకుంది. చెన్నైలో రూ.66.50 పెరిగి రూ.2916.50 నుంచి రూ.2983 పెరిగింది. పాట్నాలో రూ.3100 కు చేరుకుంది. దేశంలోనే ఈ ప్రాంతంలో అత్యధికంగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.71.50 పెరిగింది. లేహ్‌ ప్రాంతంలో అయితే, ఏకంగా 19 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.3450 కు చేరింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES