• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Government Jobs: తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. 25 ఏళ్ల నాటి నిబంధనకు స్వస్తి..!

Government Jobs: తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. 25 ఏళ్ల నాటి నిబంధనకు స్వస్తి..!

Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇద్దరికి మించి పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని 25 ఏళ్ల నాటి నిబంధనను ఎత్తివేసింది. ఇకపై ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Nov 19, 2026, 18:23 IST|Updated: Nov 19, 2026, 18:25 IST
joinshare
Government Jobs: తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. 25 ఏళ్ల నాటి నిబంధనకు స్వస్తి..!
Image Credit: Madhya Pradesh Govt (Source: File)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన నిబంధనల్లో మధ్యప్రదేశ్ సర్కార్ కీలక మార్పులు చేసింది. నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కుటుంబ నియంత్రణ నిబంధనల విషయంలో తీపి కబురు అందించింది. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులనే నిబంధనను తొలగించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో ఇకపై ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే అవకాశం కలగనుంది.

మధ్యప్రదేశ్‌లో 2001లో అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిబంధనను తీసుకొచ్చింది. దీని ప్రకారం 2001 జనవరి 26 తర్వాత మూడో సంతానం కలిగినవారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోయేవారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు మాత్రమే కాకుండా.. ఇప్పటికే విధుల్లో ఉన్న ఉద్యోగులపైనా ఈ నిబంధన వర్తించేది. ఇద్దరికి మించి పిల్లలు ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. ఈ నిబంధనపై ఇటు ఉద్యోగులు, అటు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది.

తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారికి కూడా ప్రయోజనం కలగనుంది. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నారనే ఒక్క కారణంతో పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణ కేసులను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ కారణంతో ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగిస్తూ.. తుది ఉత్తర్వులు జారీ చేసిన కేసులను మాత్రం తిరిగి తెరవబోమని స్పష్టం చేసింది. అంటే పెండింగ్‌లో ఉన్న కేసులకు మాత్రమే తాజా నిర్ణయం వర్తించనుంది.

కాగా.. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారిపై ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో విధించిన పరిమితులను కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సడలించాయి. ఛత్తీస్‌గఢ్ 2017లోనే ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన ఇలాంటి నిబంధనను తొలగించింది. రాజస్థాన్ కూడా కొన్ని వర్గాలకు మినహాయింపులు కల్పిస్తూ మార్పులు చేసింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఈ కోవలోకి చేరింది. 

Add Zee News as a Preferred Source
TAGS:
Employees