Uttar Pradesh: రెచ్చిపోయిన ఏనుగు.. ఇనుప గొలుసును తెంచుకుని మావటిపై దాడి.. షాకింగ్ వీడియో..
Elephant attacks on Mahout: మావటిపై ఏనుగు బీభత్సంగా దాడి చేసింది. వారణాసి లో చోటు చేసుకున్న ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. రెండు కరెంట్ స్తంభాలను కూడా పెకిళించి పడేసినట్లు చెబుతున్నారు.
Mahout injured in elephant attack on ramlila in Varanasi: సాధారణంగా చాలా మంది ఉత్సవాలు, పండగల నేపథ్యంలో ఇటీవల ఏనుగులను తీసుకొని వస్తున్నారు. ఇటీవల ఏనుగుల కొన్ని సార్లు జనాలకు భయపడి దాడులు చేస్తున్నాయి. టపాకాయల చప్పుళ్లు, డ్రమ్ ల శబ్దాలకు ఏనుగులు బెదిరిపోయి చుట్టుపక్కల ఉన్న వారిపై దాడి చేసిన ఘటనలు కొకొల్లలు. అయితే కొన్ని సందర్భాల్లో ఏనుగులను కంట్రోల్ చేయడానికి చూసిన మావటి వాళ్లను కూడా ఈడ్చి పడేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా.. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో ఒక ఏనుగు బీభత్సం సృష్టించింది.
ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి రామ్ నగర్ లో ఏనుగు రెచ్చిపోయింది. దసరా నేపథ్యంలో రామ లీలా కోసం
అజమ్‌గఢ్ నుంచి తెచ్చిన ఏనుగు ధనరాజ్ ఒక్కసారిగా రెచ్చిపోయింది.అప్పటి వరకు కూల్ గా ఉన్న ఏనుగు కాస్త ఇనుప గొలుసును తెంచుకుంది.అక్కడున్న వస్తులను తన తొండంతో ఎత్తిపడేసింది. ఇంతలో మావటి వాడు ఏనుగును కంట్రోల్ చేద్దామని చూడగా అతనిపై కూడా దాడి చేసింది.
మావటిని తొండంతో ఎత్తి పడేసి, అతని ఛాతీపై తొక్కింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో స్థానికులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఆ తర్వాత ఏనుగు పంచవటి-లంక రోడ్డుపైకి దూసుకెళ్లింది.
మార్కెట్ గేట్‌ను పగలగొట్టి, రెండు కరెంట్ స్తంభాలను పెకిలించి వేసింది. దీంతో చిన్న దుకాణాలు, టిన్ షెడ్లను నాశనం చేయడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే పోలీసులు, ఫారెస్ట్, NDRF సహా 200 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. గోరఖ్‌పూర్ జూ నిపుణులు ప్రత్యేకంగా గంటల వ్యవధిలో అక్కడకు వచ్చి జైలాజిన్ ట్రాంక్విలైజర్‌తో ఏనుగుకు మత్తు ఇచ్చి అదుపులొకి తెచ్చారు. ఈ ఏనుగు బీభత్సంకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.