• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Rajasthan: వన్ లిప్ కిస్ ప్లీజ్.. థాయ్ యూబ్యూబర్‌కు ఉదయ్ పూర్ లో లైంగిక వేధింపులు.. వీడియో వైరల్..

Rajasthan: వన్ లిప్ కిస్ ప్లీజ్.. థాయ్ యూబ్యూబర్‌కు ఉదయ్ పూర్ లో లైంగిక వేధింపులు.. వీడియో వైరల్..

Thai youtuber molested: ప్రముఖ థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్ జస్ట్ కెత్ పై వేధింపుల ఘటనపై నెట్టింట దుమారం చెలరేగింది. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Nov 16, 2026, 17:38 IST|Updated: Nov 16, 2026, 17:46 IST
joinshare
Rajasthan:  వన్ లిప్ కిస్ ప్లీజ్.. థాయ్ యూబ్యూబర్‌కు ఉదయ్ పూర్ లో  లైంగిక వేధింపులు.. వీడియో వైరల్..
Image Credit: man asked kiss to thai youtuber video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Man asked one lip kiss to thai youtuber udaipur video: మనదేశంలోని పలు ప్రాంతాల్ని సందర్శించేందుకు ఇటీవల విదేశీయులు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా యూట్యుబర్ లు వచ్చి ఇక్కడి ప్రాంతాల్ని సందర్శించి సోషల్ మీడియాలో రీల్స్ లు పోస్ట్ చేస్తున్నారు. అయితే.. చాలా మంది విదేశీయులకు ఇక్కడి వాతావణం కొత్తగా ఉంటుంది. పైగా భాష కూడా రాక పొవడం వల్ల కొంత మంది కామాంధులు ఒంటరిగా వచ్చే విదేశీ మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు.  మహిళలకు లాడ్జీలకు తీసుకెళ్తామని, సాయం చేస్తామని చెబుతూ వారిని ట్రాప్ చేస్తున్నారు. మరికొంత మంది సెల్ఫీలు, రీల్స్ పేరిట వారిపట్ల అసభ్యంగా కూడా  ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో  రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

Adul harasses Thai Youtuber JustKeth during livestream in Udaipur repeatedly asking for Kiss What should be done to such quam because of them all bad name comes to Bharat https://t.co/8k8ZoYjwHu

— Comman Man (@CommanMan777589) November 16, 2026

 


రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ ను సందర్శించేందుకు వచ్చిన ప్రముఖ థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్ 'జస్ట్‌కెత్' కు షాకింగ్ అనుభవం  ఎదురైంది. ఆమె అక్కడి ప్రాంతాల్ని వీడియో తీస్తుంది. ఇంతలో సదరు యువతి లైవ్ స్ట్రీమింగ్ లో ఉండగానే.. ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు. ఆ తర్వాత వన్ లిప్ కిస్ అంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె నిరాకరించిన కూడా కనీసం చెంప మీద అయిన ఒక ముద్దు కావాలంటూ బరితెగించి ప్రవర్తించాడు. ఈ ఘటనతో ఆమె షాక్ కు గురైంది.

అయినప్పటికీ అతడు వెనక్కి తగ్గకుండా అదే అభ్యర్థనను మళ్లీ మళ్లీ చేస్తూ ఆమెను ఇబ్బందికి గురిచేశాడు. చివరకు ఫోటో అయిన దిగుతానని వేధించాడు. ఇక చేసేది లేక ఆమె లైవ్ లోనే అతనితో ఫోటో దిగింది. అతగాడు, షేక్ హ్యాండ్ ఇవ్వవడానికి ప్రయత్నించగా ఆమె తిరస్కరిస్తు పిడికిలితో అతడ్నినియంత్రించింది. 

ఈ మొత్తం ఘటన లైవ్ స్ట్రీమింగ్ లో రికార్డు అయ్యింది. ఆ తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ అతిథి దేవో భవ అని గొప్ప నానుడిని పాటిస్తుందని ఇలాంటి నీచుల వల్ల మన దేశంకు చెడ్డపేరు వస్తుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ కామాంధుడ్ని గుర్తించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
Trending News