SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Video Viral: పోయేకాలం అంటే ఇదేనేమో.. రన్నింగ్ ట్రైన్ ముందు రీల్స్.. వీడియోపై నెట్టింట దుమారం..

Man reels on railway platform: వేగంగా వెళ్తున్న రైలు ముందు నిల్చుని యువకుడు రీల్స్ తీసుకుంటున్నాడు. ఈ వీడియోపై నెటిజన్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెప్పపాటులో నిండు ప్రాణాం పోయే చాన్స్ ఉందని వాపోతున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 05, 2026, 06:34 PM IST | Updated: Nov 05, 2026, 06:44 PM IST
Image Credit: man reels infront of running train video
Join

Man Dangerous reels Infront of running train video: ఇటీవల కొంత మంది సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొంత మంది డెంజర్ గా రీల్స్ చేస్తున్నారు. మరికొంత మంది  వ్యూస్ , లైక్ ల కోసం ఎంతటి  రిస్క్ అయిన చేస్తున్నారు. ఈ ప్రమాదకర స్టంట్ లతో కొన్నిసార్లు వీరి ప్రాణాలు కూడా గాల్లో కలుస్తున్న ఘటనలు కొకొల్లలు.  ఇటీవల మెట్రోలు, రైల్వే ప్లాట్ ఫామ్ ల మీద కొంత మంది యువతీ, యువకులు ప్రమాదకరంగా స్టంటులు చేస్తున్నారు. రీల్స్ లు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు.  రీల్స్ చేస్తుండగా  వేగంగా వచ్చిన రైలుఢీకొని కొంత మంది విగత జీవులుగా మారిపోయారు. 

 

 

మరికొంత మంది కాళ్లు చేతులు కోల్పోయి జీవచ్చవంలా మారిన ఘటనలు ఉన్నాయి.ఈ క్రమంలో ప్రస్తుతం ఒక  యువకుడు పట్టాల దగ్గరకు వెళ్లాడు. అప్పటికే దాని మీద రైలు వేగంగా వచ్చే వరకు ఆగి, ఆతర్వాత దాని ముందు రీల్స్ చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న రైలు దగ్గరకు వెళ్తున్నట్లుఫోజులిస్తు రీల్స్ తీసుకున్నారు. ఆ ట్రైన్ కు కొద్ది దూరంలోనే యువకుడు ఉన్నాడు. ఏ మాత్రం వెంట్రుక వాసిలో తేడా జరిగిన కూడా యువకుడి ప్రాణాలు గాల్లో కలుస్తాయి.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా అసలు ఇలాంటి స్టంట్ లతో ఎవరికి ఉపయోగం అంటూ మండిపడుతున్నారు. రైల్వే శాఖ వారు సైతం ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసుకుని చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES