MP Rasgulla Bomb: వామ్మో.. నోట్లో పెట్టగానే బాంబులా పేలిన రసగుల్లా.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..
Rasgulla explodes on mp: రసగుల్లా అని చెప్పడంతో వెంటనే నోట్లో వేసుకుని కొరికాడు. ఇంతలో అది పెద్ద శబ్దం చేస్తు పేలింది. మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈఘటన స్థానికంగా దుమారంగా మారింది.
Madhya pradesh man dies after rasgulla explodes in his mouth: ఇటీవల చాలా మంది తమ ప్రత్యర్థుల్ని చంపేందుకు కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. కొంతమంది మధ్యవర్తులతో హత్యలకు కుట్రలు చేస్తున్నారు. మరికొంత మంది కాపుకాచి అదను చూసిమరీ దారుణాలకు పాల్పడుతున్నారు. మొత్తంగా టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే ఏవిధంగా అయిన కుట్రలు చేసేందుకు వెనుకాడటంలేదు.ఈ క్రమంలో మధ్య ప్రదేశ్ లోని దిండోరి జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా పదరియా ఛాంటా గ్రామంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాజేంద్ర బరౌతియా అనే వ్యక్తి ఫ్యామిలీతో కలిసి భోజనం చేశాక.. రాత్రి 8 గంటల సమయంలో వరండాలో కూర్చున్నాడు.
ఇంతలో ఆయన స్నేహితుడు రామభగత్ రావడంతో.. ఇద్దరూ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అయితే.. దీపావళి పండగ కావడంతో.. రసగుల్లా అని చెప్పి ఒక గుండ్రని పదార్ధం ఇచ్చాడు. చీకట్లో సరిగ్గా కన్పించకున్నా కూడా రసగుల్లా అని చెప్పడంతో వెంటనే నోట్లో వేసుకుని కొరికాడు. దీంతో అతి పేలిపోయింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
దీంతో రాజేంద్ర బరౌతియా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రామ భగత్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో..రాజేంద్రకు ‘పిగ్-కిల్లర్ బాంబ్’ ను రామభగత్ ఇచ్చినట్లు గుర్తించారు. ఇద్దరి మధ్యఏదైన వివాదాలు ఉన్నాయా..?.. లేదా ఎవరైన ఈ విధంగా బాంబు పేల్చి హతమార్చేందుకు ప్రయత్నాలు చేశారా.?.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన మాత్రం స్థానికంగా సంచలనంగా మారింది.