SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పడగ విప్పిన కోబ్రాకు ముద్దు పెట్టిన యువకుడు.. చూస్తే షాకవుతారు!

King Cobra Kissing Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక ప్రమాదకరమైన నాగుపాముsకు సంబంధించిన వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక యువకుడు ఆ ప్రమాదకరమైన పాముకు ముద్దు పెట్టుకోవడం మీరు గమనించవచ్చు. ఇది చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 18, 2026, 05:34 PM IST | Updated: Oct 18, 2026, 05:37 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

King Cobra Kissing Video: మీడియా కాలంలో కేవలం కొద్ది మంది ఫాలోవర్లతోపాటు లైకులు వ్యూస్ కోసం కొందరు యువకులు ఎంతటి ప్రమాదానికైనా ఏమాత్రం విన కాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రాణాలను సైతం పణంగా పెట్టి విన్యాసాలు చేయడం ఇప్పుడు సహజమైపోయింది. రాజాగా అలాంటి అత్యంత భయానకమైన సంఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అసలు ఈ వీడియో ఏంటి? ఇంతలా వైరల్ అవ్వడానికి దీని వెనుక ఉన్న కారణాలేంటి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ అటవీ ప్రాంతంలో అత్యంత పొడవైన, ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పడక విప్పి బుసలు కొడుతూ నిలబడి ఉండడం మీరు గమనించవచ్చు. సాధారణంగా అంత పెద్ద పామును చూస్తే ఎంతటి ధైర్యవంతులైన ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటారు.. అయితే అక్కడ ఉన్న ఒక యువకుడు మాత్రం చేయకూడని పని చేసేసాడు. ఏమాత్రం భయం లేకుండా విచిత్రంగా ప్రమాదకరమైన పాము ముందుకు వెళ్లాడు. ఆ తర్వాత పడగవిప్పి నిలబడి ఉన్న ఆ కోబ్రా ముందు నిలబడి ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు..

ఆ పాము ఏ క్షణంలోనైనా కాటు వేసే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ.. అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎట్టకేలకు దాని పడగపై ముద్దు పెట్టేయడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ఆ దృశ్యాన్ని చూస్తున్న నిటిజన్లకు వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అంత ప్రమాదకరమైన కోబ్రాకు ముద్దు పెట్టడం ఏంటని చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా పెంచుకున్న పాములకు ఇలా కొంతమంది ముద్దులు పెట్టిన వీడియోలు గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. కానీ అడవిలో ఎంతో ప్రమాదకరమైన ఇలాంటి పాములకు కూడా ముద్దులు పెట్టడం అంటే గ్రేట్ అని అంటున్నారు..

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో వన్యప్రాణి సంరక్షకులతో పాటు సోషల్ మీడియా వినియోగదారులు స్పందిస్తూ వస్తున్నారు. కింగ్ కోబ్రా కాటు వేస్తే.. కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు పోయేంత శక్తివంతమైన విషం ఉన్న ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని వన్యప్రాణి సంరక్షకులు సూచిస్తున్నారు. మూగజీవులను ఇలా సోషల్ మీడియా ఫుటేజ్ కోసం రెచ్చగొట్టడం అస్సలు మంచిది కాదని మరికొంతమంది అంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES