SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

MLA Raghuraj Pratap Singh: వందలాది తుపాకుల మధ్య ఎమ్మెల్యే రాజా భయ్యా ఆయుధ పూజ.. వీడియో వైరల్..

Pratapgarh mla ayudha puja: తమ పూర్వీకుల నుంచి వస్తున్న లైసెన్స్ డ్ తుపాకులతో ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ ఆయుధ పూజ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 20, 2026, 07:03 PM IST | Updated: Oct 20, 2026, 07:12 PM IST
Image Credit: Pratapgarh mla ayudha puja
Join

MLA Raghuraj Pratap Singh performed ayudha puja: దేశ వ్యాప్తంగా దసరా పండగను కన్నుల పండుగలా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా దసరా నేపథ్యంలో పలు చోట్ల ఆయుధ పూజలను కూడా చేస్తారు. చాలా మంది ఈ రోజున శమీ చెట్టును దర్శించుకుంటారు. అమ్మవారికి తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా యూపీలోని ప్రతాప్ గఢ్ కు చెందిన ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్  ఆయుధ పూజతో వార్తలలో నిలిచారు. 

 

 

ఉత్తరప్రదేశ్‌లోని కుండా నియోజక వర్గ ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ దసరా నేపథ్యంలో ఆయుధ పూజ చేశారు. అనాదీగా తమ పూర్వీకుల నుంచివస్తున్న...వందలాది తుపాకులు, రైఫిళ్ల ను ఎర్రటి క్లాత్ పరిచి దాని మీద పెట్టారు. దాదాపుగా 500 వరకు ఆయుధాలు ఉన్నాయని చెబుతుంటారు.

దీనిలో స్వదేశీ, విదేశీ తుపాకులు ఉన్నాయి. అయితే అన్నింటికి కూడా లైసెన్స్ ఉన్నాయి. అనాదీగా తమ వంశంలో ఆయుధ పూజ చేస్తారని  ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ తెలిపారు.  ఈ పూజలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరులు, నియోజక వర్గ ప్రజలు కూడా పాల్గొంటారు.  గతంలో ఆయన ఆయుధాలకు లైసెన్స్ విషయంలో వివాదం తలెత్తింది. దీనిపై ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ పోలీసులకు స్వయంగా క్లారిటీ ఇచ్చారు. దసరా పండగ వేళ ఆయుధ పూజలతో మరోసారి రాజా భయ్యా సోషల్ మీడియాలో వైరల్గా మారారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES