Monkey Drinks Alcohol in Jharkhand: సాధారణంగా మద్యం దుకాణాల వద్ద మనం అప్పుడప్పుడు రకరకాల మనుషులు వింత ప్రవర్తనలతో అటు ఇటు తూగుతూ నడవడం, ఏదేదో అరవడం వంటివి చూస్తూv ఉంటాం.. కానీ ఓ మద్యం షాపులోకి దర్జాగా ప్రవేశించి.. బాటిల్ ఓపెన్ చేసి తాగిన ఓ కోతి స్థానికంగా తీవ్రంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో ఓర్మాంఝీ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ విచిత్రాన్ని చూసి ఆ వైన్ షాప్ లో వర్క్ చేస్తున్న వర్కర్స్ అంత ఆశ్చర్యపోయారట. అంతేకాకుండా అక్కడున్నవారే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది.
షాపులోకి ప్రవేశించి.. బాటిల్ ఖాళీ చేసిన కోతి..
ఓర్మాంఝీ బ్లాక్ చౌక్ వద్ద ఉండే ఓ వైన్ షాప్ లోకి రోజు లాగే చాలామంది మధ్యాన్ని విక్రయిస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే కోతి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. నెమ్మదిగా వైన్ షాపులోకి చొరబడింది. లోపలికి వెళ్లిన ఆ కోతి అటు ఇటు చూసి. కౌంటర్ పై ఉన్న ఒక మద్యం తీశాను చేతిలోకి తీసుకుంది.. అయితే సిబ్బంది దానిని మద్యం సీసా తీసుకునే క్రమంలో ఆపేందుకు ప్రయత్నించారు కానీ.. ఆ కోతి వారిపై దాడి చేసేందుకు వచ్చిందట.. ఆ తర్వాత వానరం నోటి సహాయంతో బాటిల్ మూతను తీసి మద్యాన్ని తాగేసింది..
అప్పటివరకు ఎంతో హుషారుగా కనిపించిన కోతికి.. మద్యం కడుపులోకి వెళ్లిన కొద్ది నిమిషాలకి నషా తలకి ఎక్కేసింది.. శరీరం సహకరించకపోవడంతో అక్కడే దుకాణంలో ఉంచిన మందు సీసాల డబ్బాలపై పడుకొని గాఢ నిద్రలోకి జారుకుంది. పక్కన ఎంత శబ్దం వస్తున్న ఏమాత్రం లేవకుండా.. పూర్తి మత్తులో పడుకున్న కోతిని చూసి అందులో పని చేస్తున్న సిబ్బందితోపాటు వచ్చిన కస్టమర్ల సైతం ఆశ్చర్యపోయారట..
ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలతో పెద్ద సంఖ్యలో దుకాణం వద్దకు తరలివచ్చారు.. కొంతమంది ఈ దృశ్యాన్ని తమ స్మార్ట్ ఫోన్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అంతే పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ రీల్స్ వైరల్ అవ్వడం ప్రారంభమయ్యాయి.. నిద్ర లేచాక కోతి ఎలా ప్రవర్తిస్తుందోనని అక్కడున్న వర్కర్స్ ఆందోళన చెందారట.. వెంటనే వారు అటవీ శాఖ సిబ్బందికి కూడా సమాచారం అందించారట.. హుటా హుటిన వారు ఘటనా స్థలానికి చేరుకొని మత్తులో పడి ఉన్న కోతికి ఎలాంటి గాయాలు కాకుండా చాకచక్యంగా రక్షించారట. సురక్షితమైన బోనులో ఆ కోతిని అక్కడి నుంచి తరలించారని సమాచారం.. ఏది ఏమైనా.. సాధారణంగా పండ్లతో పాటు కొన్ని రకాల దూసుల కోసం ఇళ్లపై, దుకాణాలపై దాడి చేసే కోతులు.. ఇలా నేరుగా వైన్ షాపు లోపలికి వెళ్లి మద్యం తాగడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది..