SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Motorola కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. 45W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు!

Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్‌ఫోన్‌ ఈ రోజు లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అత్యంత తక్కువ ధరలోనే లాంచ్‌ కాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 24, 2026, 11:50 IST | Updated: Nov 24, 2026, 11:52 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Motorola Edge 70 Neo: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా.. త్వరలోనే భారత మార్కెట్లో తమ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.. దీనిని కంపెనీ మోటరోలా ఎడ్జ్ 70 నియో పేరుతో అధికారంగా ఈ రోజు విడుదల కాబోతోంది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త ఫోన్‌లో కంపెనీ భారీ స్థాయిలో మార్పులు, అప్‌గ్రేడ్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లతో పాటు ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ మోటరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది.. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ లైవ్‌ కూడా అవుతోంది.. దీనితో పాటు మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. కంపెనీ ఇంకా అధికారికంగా ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర, ఫీచర్స్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేద.. కానీ ఇది భారత మార్కెట్లో ధర రూ. 30,000 రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

గత మోడల్‌తో పోలిస్తే.. ఈ మోటరోలా ఎడ్జ్ 70 నియో ఫోన్ డిస్‌ప్లే సైజు కూడా మారినట్లు తెలుస్తోంది.. కంపెనీ ఏకంగా 6.8 అంగుళాల డిస్ల్పేతోయ విడుదల చేయబోతోంది.. పెద్ద స్క్రీన్ ఫోన్లను ఇష్టపడే వారికి ఈ స్మార్ట్‌ఫోన్‌ బెస్ట్‌ ఛాయిగా భావించవచ్చు.. అయితే, కాంపాక్ట్ ఫోన్ల కోసం ఎదురుచూసే వారికి మాత్రం ఇది అంతగా పనికి రాకపోవచ్చు.. ఈ ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన AMOLED ప్యానెల్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది ఏకంగా 5200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో లాంచ్‌ కానుంది. కాబట్టి ఎండలో కూడా స్క్రీన్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుందని సమాచారం.

మోటరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌ను కూడా వినియోగించినట్లు తెలుస్తోంది. మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్ కోసం ఇందులో 12GB వరకు ర్యామ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. దీనికి తోడు ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ కూడా లభిస్తోంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, USB-C పోర్ట్‌లను కూడా అందించింది. వెనక భాగంలో 50MP సోనీ LYT-710 ప్రధాన కెమెరా కూడా లభిస్తోంది. దీంతో పాటు అదనంగా 2MP మాక్రో కెమెరా కూడా అందుబాటులో ఉంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES