• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Pune Techie Murder: ప్రియురాలిని చంపి రాత్రంతా శవం పక్కన కూర్చుని ఆ పని .!. పూణెలో వెలుగులోకి దారుణం..

Pune Techie Murder: ప్రియురాలిని చంపి రాత్రంతా శవం పక్కన కూర్చుని ఆ పని .!. పూణెలో వెలుగులోకి దారుణం..

Pune Techie murder case: పూణెకు చెందిన టెకీలు కోమల్ దహలే, శుభం ధ్యానేశ్వర్ కల్బండేలు ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా వీరి ప్రేమకు అంగీకరించారు. ఇటీవల అనుమానంతో తరచుగా గొడవలు పడ్డారు.ఈ నేపథ్యంలో శుభం కోమల్ ఉంటున్న గదిలోకి వెళ్లి ఆమెను దారుణంగా కొట్టి హతమార్చాడు.

Written ByInamdar Paresh
Published: Nov 24, 2026, 11:17 IST|Updated: Nov 24, 2026, 12:09 IST
joinshare
Pune Techie Murder:  ప్రియురాలిని చంపి రాత్రంతా శవం పక్కన కూర్చుని  ఆ పని .!. పూణెలో వెలుగులోకి దారుణం..
Image Credit: Pune Techie Murder case

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Telangana: తెలంగాణలో ఘోరం..  కాలేజీ యువతికి  లెక్చరర్ బూతూ మెస్సెజ్‌లు.. డైలీ అలా చేయాలంటూ టార్చర్.!.

Telangana: తెలంగాణలో ఘోరం.. కాలేజీ యువతికి లెక్చరర్ బూతూ మెస్సెజ్‌లు.. డైలీ అలా చేయాలంటూ టార్చర్.!.

2

Motorola కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. 45W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు!

3

8,400mAh బ్యాటరీతో iQOO 16 కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరాలతో అదరగొట్టే ఫీచర్లు!

4

Pune Techie Murder: ప్రియురాలిని చంపి రాత్రంతా శవం పక్కన కూర్చుని ఆ పని .!. పూణెలో వెలుగులోకి దారుణం..

5

బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. BHELలో ఇంజినీర్, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు.. జీతం రూ. 60 వేల నుంచి మొదలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pune Techie Beats his Girlfriend to death: ఇటీవల చాలా మంది యువతీ, యువకులు ప్రేమ వివాహాలకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి డేటింగ్ చేస్తు లివింగ్ రిలేషన్ లో కూడా ఉంటున్నారు. ఒకరి అభిప్రాయాలు మరోకరితో షేర్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత బేధాభి ప్రాయాల వస్తే బ్రేకప్ లు చెప్పుకుంటున్నారు. లవ్ లో ఉన్నప్పుడు  కొంత మంది అవతలివారితో మాట్లాడిన కూడా అనుమానంతో తమ వారితో గొడవలు పడతారు. చాలా పొసెస్సివ్ గా ఉంటారు. కొంత మంది ప్రేమలో ఉన్నప్పుడు అవతలి వారిని కళ్లలో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఏమైన తేడా వచ్చి బ్రేకప్ చెబితే గొడవలు పడి  హత్యలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు.  ఈ క్రమంలో మహారాష్ట్రలోని పూణేలో దారుణం చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన కోమల్ దహాలే (27), బుల్ధానాకు చెందిన శుభం ధ్యానేశ్వర్ కల్బండే ఇద్దరు పూణెలో టెకీలుగా పనిచేస్తున్నారు.  వీరు మూడేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్నారు. కోమల్ విప్రోలో పనిచేస్తుండగా, శుభం మాత్రం ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాడు. తమ ప్రేమను రెండు కుటుంబాల వారికి చెప్పారు. వారు కూడా అంగీకరించారు. 

అయితే..ఏమైందో కానీ ఇధ్దరు ఒకరిపైస మరోకరు పరస్పరం అనుమానం పెంచుకున్నారు. తరచుగా వీరి మధ్య గొడవలు జరిగేవి.ఇటీవల కోమల్ పెయింగ్ గెస్ట్ రూమ్ కు శుభమ్ వెళ్లాడు. రాత్రంత వీరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంలో శుభమ్..కోమల్ పై దాడి చేశారు. ఆమె తలను గోడకు బలంగా కొట్టాడు. ఆమె ప్రైవేటు పార్ట్ లపై దారుణంగా దాడి చేశాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆమె విగత జీవిగా మారిపోయింది. 

ఆ తర్వాత అతను కూడా  షాక్ లో ఉండిపోయి ఆమె శవం పక్కనే రాత్రంతా ఆమెను చూస్తు ఉండిపోయాడు. తెల్లవారు జామున పోలీసులకు ఫోన్ చేసి తన ప్రియురాలిని చంపినట్లు చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతి గదిలోకి వచ్చి ఆమెను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. 

ఈ ఘటనపై యువతి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని విగత జీవిలా మారిన తమ కూతుర్నిచూసి కన్నీరు మున్నిరుగా విలపించారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరి మధ్య అనుమానంతోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Crime News