• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /8,400mAh బ్యాటరీతో iQOO 16 కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరాలతో అదరగొట్టే ఫీచర్లు!

8,400mAh బ్యాటరీతో iQOO 16 కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరాలతో అదరగొట్టే ఫీచర్లు!

iQOO 16 India Launch: త్వరలోనే మార్కెట్‌లోకి iQOO 16 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌తో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన 8,400mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రావడం విశేషం. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 24, 2026, 11:27 IST|Updated: Nov 24, 2026, 11:28 IST
joinshare
8,400mAh బ్యాటరీతో iQOO 16 కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరాలతో అదరగొట్టే ఫీచర్లు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Telangana: తెలంగాణలో ఘోరం..  కాలేజీ యువతికి  లెక్చరర్ బూతూ మెస్సెజ్‌లు.. డైలీ అలా చేయాలంటూ టార్చర్.!.

Telangana: తెలంగాణలో ఘోరం.. కాలేజీ యువతికి లెక్చరర్ బూతూ మెస్సెజ్‌లు.. డైలీ అలా చేయాలంటూ టార్చర్.!.

2

Motorola కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. 45W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు!

3

8,400mAh బ్యాటరీతో iQOO 16 కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరాలతో అదరగొట్టే ఫీచర్లు!

4

Pune Techie Murder: ప్రియురాలిని చంపి రాత్రంతా శవం పక్కన కూర్చుని ఆ పని .!. పూణెలో వెలుగులోకి దారుణం..

5

బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. BHELలో ఇంజినీర్, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు.. జీతం రూ. 60 వేల నుంచి మొదలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.


iQOO 16 India Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo సబ్ బ్రాండ్ iQOO.. భారత మార్కెట్లో మరో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన ఐక్యూ 15కు సక్సెసర్‌గా.. అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో iQOO 16 త్వరలోనే భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంద. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ చైనాలో విడుదలై అద్బుతమైన ప్రజాదరణ పొందింది. గత నెలలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమ్మిట్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో సందడి చేసిన సంగతి తెలిసిందే..

ఈ ఫోన్ విడుదలకు సంబంధించి ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్  ఎక్స్ వేదికగా ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ కొన్ని కీలక విషయాలను పోస్ట్ చేశారు.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఐక్యూ 16కు సంబంధించిన మైక్రోసైట్ కూడా అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలిపారు.. ఆ తర్వాత కొద్దిసేపటికే దీనిన రిమూవ్‌ కూడా చేశారట.. దీనికి తోడు.. ఐక్యూ ఇండియా సంబంధించిన CEO నిపున్ మరియా కూడా త్వరలోనే ఈ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు గతంలో ఎన్నో సార్లు తెలిపారు..

ఐక్యూ 16 సంబంధించిన అన్ని వివరాల్లోకి వెళితే.. ఇందులో 5.01 GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్‌ను కూడా అందించారు.. ఇది అడ్రినో GPUతో కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. గీక్‌బెంచ్ పరీక్షల్లో ఈ ఫోన్ సింగిల్-కోర్‌లో 2,944 పాయింట్లతో పాటు మల్టీ-కోర్‌లో 10,029 పాయింట్లు కూడా సాధించినట్లు తెలుస్తోంది. గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేక ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌.. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. ఇక దీని డిస్‌ప్లే విషయానికొస్తే..  ఇది 6.85-అంగుళాల 2K ప్లస్ LTPO AMOLED డిస్ల్పే కూడా లభిస్తోంది.. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు కళ్లు చెదిరే 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది..

ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో అద్బుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని వెనక భాగంలో మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇందులో OIS సపోర్ట్ ఉన్న 50MP ప్రధాన కెమెరాతో పాటు 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా అందిస్తోంది. సెల్ఫీల కోసం ఫ్రంట్‌ భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందిస్తోంది..

ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీను కూడా అందిస్తోంది.. అంతేకాకుండా ఇది ఏకంగా 8,400mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. దీన్ని చాలా స్పీడ్‌గా ఛార్జ్ చేయడానికి 100W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్‌తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ కూడా లభిస్తోంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది.. ఇవే కాకుండా ఇందులో చాలా రకాల కొత్త కొత్త ఫీచర్స్‌ లభిస్తున్నట్లు తెలుస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News