SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Motorola నుంచి పవర్‌ఫుల్ ఫోన్‌.. Snapdragon 8 Gen 5, 12GB ర్యామ్‌తో Moto One లాంచ్!

Motorola Moto One: త్వరలోనే మోటరోలా మోటో వన్ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ సిరీస్‌ కీలకమైన డేటాబేస్‌లో కూడా కనిపించింది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 06, 2026, 01:34 PM IST | Updated: Nov 06, 2026, 01:35 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Motorola Moto One: మోటరోలా కంపెనీ త్వరలోనే మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను లాంచ్‌ చేయబోతోంది. దీనిని కంపెనీ వన్ సిరీస్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. ఇందులో మోటరోలా మోటో వన్‌ పేరుతో మోడల్స్‌ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌ ఒక కీలకమైన డేటాబేస్‌లో కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ తయారీలో ఉందని.. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ మోటరోలా మోటో వన్‌ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మోటరోలా మోటో వన్ ఫోన్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సోషల్‌ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది.. ఈ ఫోన్ వైర్‌లెస్ పవర్ కన్సార్టియం (WPC) డేటాబేస్‌లో కనిపించడంతో టెక్‌ నిపుణులకు క్లారిటీ వచ్చిన్నట్లు తెలుస్తోంది.. టిప్‌స్టర్ గాడ్జెట్స్ డేటా కూడా ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను ఇటీవలే లీక్‌ చేశారు. ఆ లిస్టింగ్‌లో ఫోన్ మోడల్ నంబర్ XT2771-1గా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.. ఇది 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.. మోటో వన్ ఒక లిస్టింగ్‌లో కనిపించడం ఇదే మొదటిసారిగా భావించవచ్చు.. ఈ XT2771-1 మోడల్ నంబర్‌తో ఉన్న ఈ ఫోన్ గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది..

మోటో వన్  గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో పెర్కొన్న వివరాల ప్రకారం.. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. దీనిని కంపెనీ 12GB ర్యామ్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. స్కోర్‌ల పరంగా.. ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్‌లో 2109 పాయింట్లతో పాటు మల్టీకోర్ టెస్ట్‌లో 8586 పాయింట్లు సాధించిన్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి..

అయితే, కొంతమంది టిప్‌స్టార్స్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్‌ చేశారు.. లీక్‌ అయిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన AI కీ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్‌ను కలిగిన డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి రానుంది. ఫోన్ డిస్‌ప్లే కర్వ్‌డ్‌గా ఉండే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీనిని OLED ప్యానెల్‌తో విడుదల చేయబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. ఫోన్ వెనుక భాగంలో అద్భుతమైన మూడు కెమెరాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మోటరోలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES