• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘సమ్మర్ హాలీడేస్’ తెలుగు మూవీ రివ్యూ రేటింగ్.. మెప్పించిందా..!!

‘సమ్మర్ హాలీడేస్’ తెలుగు మూవీ రివ్యూ రేటింగ్.. మెప్పించిందా..!!

Summer Holidays Review: ఈ వారం దీపావళి కానుకగా ‘రామాయణం’ సహా పలు డబ్బింగ్ చిత్రాలు సందడి చేశాయి. కానీ ఈ సారి దీపావళికి తెలుగులో విడుదలైన ఒకే ఒక్క స్ట్రెయిట్ చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’. ఈ సినిమా ఒక రోజు ముందు ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 06, 2026, 03:16 PM IST|Updated: Nov 06, 2026, 03:23 PM IST
joinshare
‘సమ్మర్ హాలీడేస్’ తెలుగు మూవీ రివ్యూ రేటింగ్.. మెప్పించిందా..!!
Image Credit: Summer Holidays Review (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
DVC ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నోటిఫికేషన్ 2026.. పరీక్ష లేకుండానే ఎంపిక!  అర్హతలు, ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ ఇదే!

DVC ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నోటిఫికేషన్ 2026.. పరీక్ష లేకుండానే ఎంపిక! అర్హతలు, ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ ఇదే!

2

Diwali Tips: మంచిర్యాలలో ప్రకృతి మిత్ర ర్యాలీ.. 'టపాసులు వద్దు.. మట్టి దీపాలే ముద్దు'

3

Amitabh House Bomb Threat: ముంబైలో మరోసారి బాంబు కలకలం..ఏకంగా అమితాబ్ బచ్చన్ ఇంటికే స్పాట్ పెట్టిన దుండగులు!

4

వధూవరులను ఎత్తుకుని గిరగిరా తిరుగుతూ మహిళల డ్యాన్స్.. వీడియో వైరల్!

5

భూమి గుండ్రంగా ఉంటే మనం ఎందుకు కింద పడిపోము? భూమిపై నిలబడటం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Summer Holidays Review Rating:ధీరజ్ మొగిలినేని, గిరిధర్ వల్లభనేని నిర్మాణంలో శ్రీకర్ నయన్ దర్శకత్వంలో  చిన్నారుల సెలవుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి  ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

నగరంలో చదువుకుంటున్న పిల్లోడు ఆర్.వి (అరుణ్ దేవ్) ను ఎపుడు అతని తండ్రి చదవు గురించి ర్యాంకుల గురించి అతడిపై ఒత్తిడి చేస్తూ ఉంటాడు ఫాదర్ (హర్షవర్ధన్). ఇక అతనికి క్రికెట్ అంటే ప్రాణం. ఈ విషయాన్ని తండ్రితో చెప్పలేని పరిస్థితి. అసలు ఆనందం అన్నదే తెలియదు ఆ పిల్లాడికి. ఇంతలో వేసవి సెలవులు రావడంతో తల్లి (వాసుకి)తో కలిసి అమ్మమ్మ (జయసుధ)అమ్మమ్మ వాళ్ల ఇంటికి పోతాడు. అక్కడ ఆర్.వికి కేవీ (రోహన్ రాయ్) పరిచయం అవుతాడు. వేర్వేరు ప్రపంచాల్లో పెరిగిన ఈ ఇద్దరు పిల్లలు మంచి దోస్తులవుతారు.  కేవీ పైకి సరదా చిల్‌గా కనిపిస్తోన్న తాగుడుకు బానిసై తండ్రి కన్నుమూస్తాడు. ఒంటరిగా తల్లితో జీవనం సాగిస్తూ ఉంటాడు. అంతేకాదు తల్లి(హర్షిణి)మంచి పట్టుచీర కొనిపెట్టాలని ఆశ అతనిలో ఉంటుంది. దీని కోసం పేపర్స్ వేయడం దగ్గర నుంచి ప్రతి పనిని చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆ ఊరులో పెద్ద మనిషి వర్మ (రాజీవ్ కనకాల)తోటలోని మామిడి చెట్లను లీజు తీసుకొని .. ఆ వచ్చిన పంటను అమ్మి తన అప్పులు తీర్చాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో కేవి కష్టాలు తీరాయా..? సమ్మర్ హాలీడేస్‌ కోసం అమ్మమ్మ ఊరు వచ్చిన ఆర్.వి సమస్యలు పరిష్కారం అయ్యాయా లేవా అనేదే ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

శ్రీకర్ నయన్.. తన చిన్నప్పటి అనుభవాలతో పాటు ప్రస్తుతం స్కూళు పిల్లలు ర్యాంకుల మోజులో పడి బంధాలు, అనుబంధాలను మరిచిపోతున్నారు. అంతేకాదు ఇంట్లో తల్లిదండ్రులు కూడా ర్యాంకులు తెచ్చుకోవాలని వారిని బలవంతం చేస్తున్నారు. ఒక్కోసారి వాళ్లు ఒత్తిడి లోనవుతున్నారు. అంతేకాదు ఎవరితో మాట్లాడలన్న భయం. దీంతో ఆత్మన్యూనతకు లోనై ఆత్మ హత్యలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి పిల్లలందరినీ గుర్తు చేసేలా ఇందులో పిల్లాడు ఆర్.వి క్యారెక్టర్‌ను పెట్టాడు. చిన్నారులు ఆ పాత్రలో తమను తాము ఐడెండిఫై అవుతారు. ఇక సమ్మర్ హాలీడేస్ కోసం అమ్మమ్మ ఊరు వచ్చిన ఆర్.వికి అక్కడ స్నేహితుడు కేవి పరిచయంతో అంతా మారిపోతుంది. జీవితం అంటే కేవలం చదువు, ర్యాంకులు కాదు.. అంతకు మించి ఉందనే విషయం ఆర్.వి.తెలుస్తుంది. మరోవైపు తన కంటే వయసులో పెద్ద అయిన ఆర్.వి ది మరో దీన గాథ. ఇంట్లో పుట్టెడు కష్టాలు ఉన్న దాన్ని దిగమింగుకొని ఆనందంగా జీవించాలనుకుంటాడు. దీని కోసం పగలు రాత్రి తల్లి కోసం.. చనిపోయిన తండ్రి చేసిన అప్పు తీర్చడం కోసం కష్టపడుతుంటాడు. ఈ బాలుడు క్యారెక్టర్ ‌కు లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలు కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అంతేకాదు అమ్మమ్మ ప్రేమ, ఆప్యాయతలు, స్నేహతులు మధ్య ఎమోషన్ అన్ని బాగా పండాయి. అయితే కమర్షియల్ అంశాలకు దూరంగా కేవలం చిన్నారులను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానానికి మెచ్చుకోవాలి. నిర్మాతగా ధీరజ్ మొగిలినేని, గిరిధర్ వల్లభనేని ఇలాంటి కథను నిర్మించడం ప్రొడ్యూసర్‌గా టేస్ట్ తెలుస్తుంది. స్వచ్చమైన పల్లె అందాలు, కపటం లేని ప్రేమను సినిమా చూసే  ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఉంది. అయితే ఇలాంటి స్టోరీలు బాలరాజు కథ నుంచి ఎన్నో సినిమాల్లో చూసిందే.   పాటలు పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కమర్షియల్‌గా దీపావళి రేసులో ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.  

నటీనటుల విషయానికొస్తే.. 
35 సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న అరుణ్ దేవ్.. ఇంత చిన్న వయసులో అంత ఎమోషన్ డెప్త్ ఉన్న క్యారెక్టర్‌లో ఒదిగిపోయిన విధానం బాగుంది. రోషన్ కూడా తనదైన అనుభవాన్ని రంగరించాడు. లోపల బాధ ఉన్న స్నేహితుడు ఆనందం కోసం ఏమి చేయడానికైనా వెనకాడని కల్మషం లేని మనసు. జయసుధ అమ్మమ్మ పాత్రలో ఒదిగిపోయింది. సీనియర్ నటి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వాసుకి తల్లి పాత్రలో ఒదిగిపోయింది. వర్మ పాత్రలో రాజీవ్ కనకాల మరోసారి తన యాక్టింగ్ పవర్ ఏంటో చూపించాడు.  హర్షవర్ధన్ ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.


పంచ్ లైన్.. ‘సమ్మర్ హాలీడేస్’.. ఓ మోస్తరుగా మెప్పించే ఎమోషనల్ డ్రామా..

రేటింగ్: 2.5/5
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie