• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఆటో నడిపే తాత ఇంగ్లీష్ చూశారా? ఫ్లూయెన్సీకి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో!

ఆటో నడిపే తాత ఇంగ్లీష్ చూశారా? ఫ్లూయెన్సీకి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో!

Amravati Auto Driver Video: ఓ ఆటో నడుపుతున్న తాత ఇంగ్లీష్‌ను అత్యంత అద్భుతంగా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 10, 2026, 01:09 PM IST|Updated: Nov 10, 2026, 01:12 PM IST
joinshare
ఆటో నడిపే తాత ఇంగ్లీష్ చూశారా? ఫ్లూయెన్సీకి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. వైద్యారోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు..!!

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. వైద్యారోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు..!!

2

ఆటో నడిపే తాత ఇంగ్లీష్ చూశారా? ఫ్లూయెన్సీకి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో!

3

చేతిలో కాలుతున్న 1000 వాలా.. అంకుల్ చేసిన స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే!

4

బోన్స్ బలహీనంగా మారుతున్నాయా? ఈ 5 అలవాట్లు మానకపోతే ఆస్టియోపోరోసిస్ ప్రమాదం!

5

డిసిగ్నేషన్ కాదు.. డెసిషన్ మేకింగ్ ముఖ్యం..ఆలోచింపజేసే అద్భుతమైన నీతి కథ..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Amravati Auto Driver Video: సాధారణంగా ఏదైనా రంగంలో రాణించలనే పెద్ద చదువులతో పాటు విదేశీ డిగ్రీలు ఉండాలని చాలామంది భావిస్తుంటారు. మంచి ఎక్పీరియన్స్‌కు చదువుతో మాత్రమే కాకుండా.. నేర్చుకోవాలనే తపనతోనే గుర్తింపు వస్తుందని నిరూపించారు మహారాష్ట్రకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తాత.. మహారాష్ట్రలోని అమరావతిలో ఒక వృద్ధ ఆటో డ్రైవర్ ఏమాత్రం తప్పులు లేకుండా మాట్లాడిన ఇంగ్లీష్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడిన తీరు.. ఆత్మవిశ్వాసం సోషల్ మీడియా వినియోగ దారులు సైతం ఆశ్చర్యపోతున్నారు..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి.. సదరు పెద్దాయన సాధారణంగా ఆటో నడుపుతూ కనిపిస్తారు.. చూసేందుకు చాలా సాదాసీదాగా కనిపించే ఆయన.. ప్యాసింజర్‌తో మాట్లాడటం మొదలుపెట్టగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఏమాత్రం తడబడకుండా ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడటం ఈ వీడియోలో మీరు చూడొచ్చు.. ఆయన ఈ వీడియోలో మాట్లాడుతూ.. ఐ యామ్ ఏ వెరీ ఆస్టానిష్డ్ జెంటిల్‌మన్.. అంటూ ముసిముసి నవ్వులతో  వేర్ డు యూ స్టే? అని ప్రశ్నించారు.. ఆయన ముఖంలో కనిపించిన సహజమైన చిరునవ్వు.. చక్కటి ఇంగ్లీష్ యాక్సెంట్ అందరినీ కట్టిపడేసిందని చెప్పొచ్చు..

ఆటోలో ప్రయాణిస్తున్న యువకుడు ముందుగా ఆయన ఏదో సరదాగా మాట్లాడుతున్నారేమో అనుకున్నాడు... కానీ ఆయన పదేపదే ఎంతో నమ్మకంతో.. సరైన గ్రామర్‌తో మాట్లాడుతుండటంతో ఆశ్చర్యపోయి.. ఆ దృశ్యాలను తన ఫోన్‌లో రికార్డు చేశాడు. భాష నేర్చుకోవడానికి వయసుతోగానీ.. చేసే వృత్తితోగానీ ఎలాంటి సంబంధం లేదు.. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎవరికైనా అవసరం.. ఉపయోగకరమైన విషయమని ఆ ఆటో డ్రైవర్ తన మాటల్లో తెలిపారు.

ఈ వీడియో సోషల్ మీడియా సోషల్ మీడియాలో అప్లోడ్‌ చేసిన కొన్ని గంటల్లోనే విపరీతమై వ్యూస్‌ తెచ్చకుంది.. ఆయన పలికిన వేర్ డు యూ స్టే? డైలాగ్‌పై నెటిజన్లు రకరకాల రీల్స్.. ఫన్నీ మీమ్స్ తయారు చేస్తూ సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. కొందరు ఆయన్ను రాక్‌స్టార్ ఆటోవాలా అని అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది.

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by BHUSHAN🐻🧋 (@kon_bhushan1222)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News