• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /200MP పెరిస్కోప్ కెమెరా.. 7000mAh బ్యాటరీ.. మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వచ్చేస్తోంది!

200MP పెరిస్కోప్ కెమెరా.. 7000mAh బ్యాటరీ.. మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వచ్చేస్తోంది!

Motorola Signature 27 Launch: మార్కెట్‌లోకి మోటరోలా సిగ్నేచర్ 27 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌ను కలిగి ఉండడం విశేషం.. దీనిని కంపెనీ అద్భుతమైన OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 25, 2026, 16:01 IST|Updated: Nov 25, 2026, 16:02 IST
joinshare
200MP పెరిస్కోప్ కెమెరా.. 7000mAh బ్యాటరీ.. మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వచ్చేస్తోంది!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
200MP పెరిస్కోప్ కెమెరా.. 7000mAh బ్యాటరీ.. మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వచ్చేస్తోంది!

200MP పెరిస్కోప్ కెమెరా.. 7000mAh బ్యాటరీ.. మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వచ్చేస్తోంది!

2

My TDP App: ‘మైటీడీపీ’ యాప్ సరికొత్త చరిత్ర.. 10 లక్షలకు చేరిన 'పసుపు కుటుంబం'

3

తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

4

Delhi: ఢిల్లీలో షాకింగ్ ఘటన..కేఫ్‌లో యువతిపై సాముహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్..

5

డిసెంబర్‌లో ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో బంపర్ లాభాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Motorola Signature 27 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా భారత మార్కెట్‌లోకి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఈ సంవత్సరం లాంచ్‌ అయిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్  మోటరోలా సిగ్నేచర్ 27ను వచ్చే నెలలో భారత కస్టమర్స్‌కి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. నవంబర్ 5న విడుదలైన ఈ ఫోన్.. డిసెంబర్ 9న భారత్‌లో అధికారికంగా లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ లిస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్లో మోటరోలా సిగ్నేచర్ 27 స్టార్టింగ్‌ ధర 1,599 యూరోలతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో ఇది రూ. 1,61,500గా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. రొమేనియన్ ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్ eMAGలో 12GB ర్యామ్‌తో పాటు 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 8,499 RONగా ఉండబోతోంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.1,61,000లు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.. కానీ దీనికి సంబంధించిన విక్రయాలు మాత్రం ప్రారంభం కాలేదు.. భారత్‌లో ఈ ఫోన్ 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్‌, 16GB ర్యామ్‌తో పాటు 512GB స్టోరేజ్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది మొత్తం రెండు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.

మోటరోలా సిగ్నేచర్ 27 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఎక్స్‌ట్రీమ్ AMOLED డ్యూయో LTPO OLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుందని సమాచారం.. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో శక్తివంతమైన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం.

ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ LYT-910 ప్రధాన కెమెరాతో పాటు, 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా అదనంగా ఎన్నో కొత్త ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇందులో ఏకంగా 7,000 mAh భారీ బ్యాటరీని కూడా అందిస్తోంది. దీనికి 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Tech News