SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నవంబర్ మొదటి వారంలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు?

Bank Holidays: ఈరోజు నుంచే నవంబర్ నెల ప్రారంభమయ్యింది. అంటే.. ఈ నెలలోని మొదటివారం కూడా ప్రారంభమవుతుంది. అయితే, ఈ వారంలో ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు సెలవులు ఉన్నాయి? వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 01, 2026, 12:42 PM IST | Updated: Nov 01, 2026, 12:44 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Bank Holidays Telugu News: దీపావళి పండుగ సీజన్ ప్రారంభంతో పాటు ఈ రోజు నుంచి నవంబర్ నెల కూడా మొదలైంది. పండుగలు తో పాటు ప్రత్యేకమైన ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు వరస సెలవులు లభించబోతున్నాయి. ముఖ్యంగా డబ్బులను విత్ డ్రా చేసుకునే వారితో పాటు చెక్కుల క్లియరెన్స్, ఆర్థిక లావాదేవీల కోసం నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లాలని భావించే వినియోగదారులు ముందుగానే సెలవుల లిస్టును చూసుకోవడం ఎంతో అవసరం. లేదంటే బ్యాంకుకు వెళ్లి సమయం వృధా కావడంతో పాటు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి..

నవంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నవంబర్ రెండవ తేదీ నుంచి 8వ తేదీ వరకు వారంలో ఏ ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయి..? ఏయే ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ అద్భుతంగా వివరిస్తుంది. ఏయే ప్రాంతాల్లో ఈ వారం సెలవులు ఉన్నాయో? వీటికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సెలవుల వివరాలు..
నవంబర్ 2న మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జరిగే ప్రసిద్ధ  నోంగ్‌క్రెమ్ డ్యాన్స్ ఉత్సవం సందర్భంగా అక్కడ మాత్రమే బ్యాంకులకు స్థానిక సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు సాధారణంగానే పనిచేస్తూ ఉంటాయి.. అదేవిధంగా నవంబర్ మూడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రధాన ప్రాంతీయ లేదా జాతీయ సెలవులు లేకపోవడంతో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ తెలుపుతోంది..

ఇక నవంబర్ 8వ తేదీ ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు లభిస్తుంది. నవంబర్ నెలలో రాబోయే దీపావళితో పాటు నార్త్ లో జరిగే భాయ్ దూజ్, ఛత్ పూజ, గురునానక్ జయంతి వంటి పండగల సందర్భంగా ఆయా రాష్ట్రాల సాంప్రదాయాలతో పాటు ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా వివిధ నగరాల్లో బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు నవంబర్ రెండు నుంచి ఏడవ తేదీ వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ బ్యాంకు పనులను పూర్తి చేసుకోవచ్చు..

బ్యాంకులు మూసేసి ఉన్నప్పటికీ.. వినియోగదారులు ఇబ్బందులు కలగకుండా ఏటీఎం తో పాటు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ఆర్థిక సేవలు నిరంతరంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకమైన ట్రాన్సాక్షన్స్‌తో పాటు ఎవరైనా ఆన్లైన్ ద్వారా డబ్బులను చెల్లించాలి అనుకునేవారు డిజిటల్ బ్యాంకింగ్ ను వినియోగించి చెల్లించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES