SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Odisha Mla Video: ప్రెస్ మీట్‌లో ముద్దుల రచ్చ.. వీడియోపై అసలు విషయం బైటపెట్టిన ఎమ్మెల్యే సతీమణి..

Odisha mla news: బీజేపీ ఎమ్మెల్యే మనోరంజన్ ద్యాన్ సమంత్రా, ఆ మంత్రి వెనుక నిల్చొని ఉన్నారు. తన పక్కనున్న వ్యక్తిని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటున్నట్లు వీడియో ఒకటి తెరమీదకు వచ్చింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే మనోరంజన్ ద్యాన్ సమంత్రా భార్య మీనా సాహు రియాక్ట్ అయ్యారు. తన భర్తపై ప్రత్యర్థులు కావాలని ప్రతిష్టను భంగం కలిగేలా ఈ వీడియోలు వైరల్ చేశారన్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 14, 2026, 06:33 PM IST | Updated: Nov 14, 2026, 06:40 PM IST
Image Credit: Odisha mla kissing row
Join

Odisha bjp mla wife responds on her husband kissing video spark: ఇటీవల సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కొన్ని వీడియోలను ఏఐ టెక్నాలజీ, డీప్ ఫెక్ లతో జనరేట్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు. హీరోయిన్లను, రాజకీయ నేతల్ని టార్గెట్ చేసుకుని వారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వీడియోల్ని వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వివాదాలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే మనోరంజన్ ద్యాన్ సమంత్రా ప్రెస్ మీట్ లో  ఒక వ్యక్తిని ముద్దు పెట్టుకుంటున్నట్లు ఒక వీడియో నెట్టింట బాగా వైరల్ గా  మారింది. మంత్రి మాట్లాడుతుండగా ఈ పనిచేస్తుండటంతో దీనిపై చాలా మంది ఫోకస్ పెట్టి మరీ  ఈ ఘటనను రచ్చ చేశారు.

 

 


ఒడిశాలోని గంజాం జిల్లాలో వరద ప్రభావంపై మత్స్య, పశు వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గోకులానంద మాలిక్ మీడియాతో మాట్లాడారు. ఇదే తరుణంలో చికితీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే మనోరంజన్ ద్యాన్ సమంత్రా, ఆ మంత్రి వెనుక నిల్చొని ఉన్నారు. 

తన పక్కనున్న వ్యక్తిని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటున్నట్లు వీడియో ఒకటి తెరమీదకు వచ్చింది. దీనిపై  బీజేపీ ఎమ్మెల్యే మనోరంజన్ ద్యాన్ సమంత్రా భార్య మీనా సాహు రియాక్ట్ అయ్యారు. తన భర్తపై ప్రత్యర్థులు కావాలని ప్రతిష్టను భంగం కలిగేలా ఈ వీడియోలు వైరల్ చేశారన్నారు. ఇది పూర్తిగా ఫెక్ అని, ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన వీడియో అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై ఇప్పటికే స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఈ ఘటన మాత్రం నెట్టింట రచ్చగా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES