• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /పెట్రోల్ టెన్షన్‌కు చెక్.. పాత సైకిల్‌ను స్ప్లెండర్ బైక్‌లా మార్చేసిన యువకులు..

పెట్రోల్ టెన్షన్‌కు చెక్.. పాత సైకిల్‌ను స్ప్లెండర్ బైక్‌లా మార్చేసిన యువకులు..

Unique Bicycle Viral Video: ఇద్దరు యువకులు సైకిల్‌ను బైక్‌లా మార్చిన ఘటన రాజస్థాన్‌లోని పుష్కర్ మేళాలో చోటు చేసుకుంది. అయితే, వారు ఇద్దరు చేసిన ఈ సైకిల్‌ బైకును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వారి సైకిల్‌కి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 21, 2026, 12:09 IST|Updated: Nov 21, 2026, 12:11 IST
joinshare
పెట్రోల్ టెన్షన్‌కు చెక్.. పాత సైకిల్‌ను స్ప్లెండర్ బైక్‌లా మార్చేసిన యువకులు..
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Unique Bicycle Viral Video: భారతీయుల ఆలోచనలకు ఏ దేశపు మనుషులు సాటిరారని మరోసారి నిరూపితమైంది.. రాజస్థాన్‌లోని పుష్కర్ మేళా ఎప్పుడూ వింతలతో పాటు విశేషాలకు వేదికగా నిలుస్తూ వస్తోంది.. దేశవిదేశాల నుంచి తరలివచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా అక్కడ ఎన్నో ఆసక్తికర దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా ఇదే మేళాలో ఇద్దరు సోదరులు తయారు చేసిన ఓ వాహనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. సాధారణ సైకిల్‌ను అచ్చం  హీరో స్ప్లెండర్ బైక్ తరహాలో తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణ పాత సైకిల్‌ను మాడిఫై చేసేందుకు ఆ ఇద్దరు అన్నదమ్ములు దాదాపు నెల రోజుల పాటు ఎంతగానో కష్టపడ్డారట. సైకిల్ ఫ్రేమ్ మొత్తానికి బ్లాక్‌ కలర్‌ వేసి.. దానికి ఒక అసలైన మోటార్ సైకిల్ లుక్ తీసుకు రావడం మీరు చూడొచ్చు. ముఖ్యంగా ముందు భాగంలో స్ప్లెండర్ బైక్‌కు ఉండే హెడ్‌లైట్.. ప్రత్యేకమైన లైట్లను కూడా అమార్చడం మీరు క్లియర్‌గా చూడొచ్చు.. హెడ్‌లైట్ పైన హిందూ అనే స్టిక్కర్‌ను అంటించడం కూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది.. మీటర్ భాగంలో సిద్ధూ మూసేవాలా ఫోటోను కూడా అతికించారు.. వెనుక భాగంలో మరో వ్యక్తి బాగా కూర్చునేలా సీటును కూడా చాలా అద్భతంగా తయారు చేశారు. మొదట ఇది చూసేవారికి బైక్‌లానే కనిపిస్తూ ఉంటుంది.

దీనిని చూసిన స్థానికులు, పర్యాటకులు ఆ సోదరులను ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారట..  ఈ బైక్ నడపడానికి ఎంత ఖర్చవుతుంది? అని ఓ వ్యక్తి అడడగా... పూర్తిగా ఫ్రీ.. అంటూ వారు నవ్వుతూ సమాధానమివ్వడం మీరు చూడొచ్చు. పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం లేకుండా.. కేవలం పెడల్ తొక్కుతూనే బైక్ నడిపిన ఎక్పీరియన్స్‌ పొందవచ్చని వారు తెలుపుతున్నారు.

పుష్కర్ మేళాలో సందడి చేస్తున్న ఈ ప్రత్యేక సైకిల్ వీడియోను  sunil_pushkar_00 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ నుంచి షేర్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది.. వీడియోలో ఆ ఇద్దరు సోదరుల మధ్య జరిగే.. సరదా సన్నివేశాలు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. తక్కువ ఖర్చుతో.. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా వారు చేసిన ఈ ప్రయోగాన్ని చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by sunil Pushkar (@sunil_pushkar_00)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News
Viral News