OnePlus 16 Launch Date: గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి ప్రజాదరణ కలిగిన బ్రాండ్‌లలో వన్‌ప్లస్ ఒకటి.. ఈ కంపెనీ విడుదల చేసే స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. అందుకే ఇది ఎప్పటికప్పుడు అద్బుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను అత్యంత తక్కువ ధరల్లోనే విడుదల చేస్తూ వస్తోంది. మీరు కూడా మంచి వన్‌ఫ్లస్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు. అయితే, తప్పకుండా మరికొన్ని రోజులు పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్‌ప్లస్ 16 (OnePlus 16) మొబైల్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ మొదట చైనాలో అక్టోబర్ 12న లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఆ తర్వాత దీనిని కంపెనీ భారత మార్కెట్‌లో కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకు ముందే.. ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
9,000 mAh బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్ట్..
ఈ కొత్త మోడల్ అద్భుతమైన డిజైన్‌తో పాటు భారీ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ 9,000 mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే ఇది 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు గేమింగ్ చేసేవారికి ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో సహాయపడుతుంది. కాబట్టి మల్టీ టాస్కింగ్‌తో పాటు గేమ్స్ ఆడేవారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
అద్భుతమైన ప్రాసెసర్..
ఇది ఎంతో శక్తివంతమైన శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా AnTuTu బెంచ్‌మార్క్ టెస్టింగ్‌లో కూడా అద్భుతమైన స్కోర్ కూడా సాధించినట్లు తెలుస్తోంది. మొబైల్ గేమర్ల కోసం విండ్ ఛేజర్ గేమింగ్ కోర్, ఈ-స్పోర్ట్స్ ట్రిపుల్ చిప్ సెటప్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీంతో పాటు గేమింగ్ మోడ్‌లో అద్భుతంగా 185 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది.
200 మెగాపిక్సెల్ కెమెరా..
కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే.. ఇందులో అడ్వాన్స్‌డ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో అద్భుతమైన 200 MP ప్రదాన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు 50 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది అల్ట్రా-థిన్ బెజెల్స్ డిజైన్ ఫోన్‌కు మరింత ప్రీమియం లుక్ అందిస్తుంది.
స్టోరేజ్ వేరియంట్లు..
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత సరికొత్త కలర్ఓఎస్ 17తో అందుబాటులోకి రాబోతోంది.. యూజర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోగల స్మార్ట్ కీ కూడా అందుబాటులో ఉండబోతోంది. దీని ద్వారా ఫ్లాష్‌లైట్ లేదా రికార్డింగ్ వంటి 9 రకాల ఫంక్షన్లను సులభంగా యాక్సెస్ చేసుకునే అవకాశాలు కూడా లభిస్తున్నాయి. అయితే, దీనిని కంపెనీ నాలుగు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది..ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. అయితే, త్వరలోనే భారత మార్కెట్‌లోకి కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు.