SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. OnePlus Ace 7 స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు!

OnePlus Ace 7 Leaks: త్వరలోనే మార్కెట్‌లోకి OnePlus Ace 7 ఫోన్‌ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ వపర్‌ఫుల్‌ ఫీచర్స్‌తోమ లాంచ్‌ చేయబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 11, 2026, 01:59 PM IST | Updated: Oct 11, 2026, 02:00 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

OnePlus Ace 7 Leaks: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) త్వరలో అద్భుతమైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేయబోతోంది. దీనిని కంపోనీ OnePlus Ace 7 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్  గీక్‌బెంచ్ (Geekbench) డేటాబేస్‌లో కూడా ఈ మోడల్ కనిపించిన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు కొన్ని స్పెషిఫికేషన్స్‌ లీక్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ మొబైల్‌ PMS110 మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ పరీక్షల్లో వన్‌ప్లస్ ఏస్ 7 సింగిల్-కోర్ విభాగంలో 3,510 పాయింట్లతో పాటు మల్టీ-కోర్ విభాగంలో 10,766 పాయింట్లతో అద్భుతమై స్కోరు సాధించినట్లు తెలుస్తోంది.. దీని బట్టి చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతంగా ఉంబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్‌కి సంబంధించిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (SM8850) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మల్టీటాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్ కోసం వినియోగించి.. ఇందులో కంపెనీ ఏకంగా 16GB వరకు ర్యామ్‌తో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ ఇంటర్‌ఫేస్‌పై పని చేయబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి..

ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5K రిజల్యూషన్‌తో ఫ్లాట్ OLED ప్యానెల్‌ డిస్ల్పేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. గేమింగ్ చేసేవారికి మంచి స్ట్రోలింగ్‌ కోసం.. ఇందులో 185Hz వరకు హై-రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. వెనుక భాగంలో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ సెకండరీ అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరాలతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌లో భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా లభిస్తోంది..

ఈ OnePlus Ace 7 ఫోన్‌లో ఏకంగా 9,000mAh కలిగిన భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. దీనికి తోడు 100W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది.. ముఖ్యంగా హెవీ గేమింగ్ చేసినప్పుడు వేడెక్కకుండా ఉండేందుకు ఫోన్‌లో ఇన్-బిల్ట్ కూలింగ్ ఫ్యాన్‌తో పాటు అద్భుతమైన థర్మల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. వన్‌ప్లస్ గతంలో తమ Ace సిరీస్ మోడళ్లను భారతదేశంలో R సిరీస్ పేరుతో రీబ్రాండ్ చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఈ మోడల్ కూడా భారత మార్కెట్‌లోకి రీబ్రాండెడ్ వేరియంట్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES