OnePlus Ace 7 సిరీస్ వచ్చేస్తోంది.. Snapdragon 8 Elite Gen 5తో భారీ అప్‌గ్రేడ్!
OnePlus Ace 7 Series: త్వరలోనే మార్కెట్‌లోకి OnePlus Ace 7 స్మార్ట్‌ఫోన్ సిరీర్ కూడా విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే, ఇందులో మోడల్స్ ధర రూ.70,000 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus Ace 7 Series: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు OnePlus మరోసారి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కంపెనీ త్వరలోనే ఫ్లాగ్‌షిప్ సిరీస్‌తో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని ఏస్ లైనప్‌లో భాగంగా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది వన్‌ప్లస్ ఏస్ 7 (OnePlus Ace 7) పేరుతో తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, కంపెనీ అధికారిక ప్రకటనకు ముందే.. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్ లీక్ అయినట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సిరీస్‌లో బేస్ మోడల్‌తో పాటు ఎంతో శక్తివంతమైన వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో మోడల్ కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను OnePlus 16R పేరుతో రీబ్రాండ్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.. ధరల విషయానికి వస్తే.. భారత కరెన్సీ ప్రకారం.. ఇది దాదాపు రూ.70,000 నుంచి రూ.75,000తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫ్లాట్ LTPS OLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 1.5K రిజల్యూషన్‌తో పాటు 185Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో విడుదల కాబోతోంది.. దీనివల్ల గ్రాఫిక్స్‌తో పాటు అల్ట్రా-స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా అద్బుతంగా ఉంటుంది..
క్వాల్‌కామ్ సంస్థకు సంబంధించిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5) కస్టమ్ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది.. మల్టీటాస్కింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు థర్మల్ మేనేజ్‌మెంట్ సపోర్ట్‌తో లాంచ్ కాబోతోంది. ఇందులో భాగంగా వేడిని తగ్గించడానికి ఒక పెద్ద యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను కూడా రాబోతోంది..
ఈ స్మార్ట్‌ఫోన్ అద్బుతమైన కెమెరా సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా వెనక భాగంలో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో కూడిన కెమెరా సెటప్ కూడా అందుబాటులోకి రాబోతుండడం విశేషం.. ఇందులో ఎంతో శక్తివంతమైన 9,000 mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉండబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నారు.
గతంలో లాంచ్ అయిన ఏస్ 6 తో పోలిస్తే డిస్‌ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ పరంగా త్వరలోనే విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వన్‌ప్లస్ కంపెనీ త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.