• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /Mangalagiri Lodge Incident: ప్రమోషన్ వీడియో అని పిలిచి మంగళగిరిలో యువతిపై అత్యాచారం..రూ.14,000 దోపిడి!

Mangalagiri Lodge Incident: ప్రమోషన్ వీడియో అని పిలిచి మంగళగిరిలో యువతిపై అత్యాచారం..రూ.14,000 దోపిడి!

Mangalagiri Lodge Incident Case: ఆన్‌లైన్, సోషల్ మీడియా పరిచయాలు పెను ప్రమాదాలకు దారితీస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతిని పెట్ షాప్ ప్రమోషన్ రీల్స్ చేయాలంటూ మంగళగిరి రప్పించి, మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కడప పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును మంగళగిరికి బదిలీ చేయగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Written ByHarish Darla
Published: Oct 07, 2026, 12:55 PM IST|Updated: Oct 07, 2026, 12:59 PM IST
joinshare
Mangalagiri Lodge Incident: ప్రమోషన్ వీడియో అని పిలిచి మంగళగిరిలో యువతిపై అత్యాచారం..రూ.14,000 దోపిడి!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రష్యాలో ఉద్యోగం అంటూ మోసం.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధానికి తెలంగాణ యువకులు!

రష్యాలో ఉద్యోగం అంటూ మోసం.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధానికి తెలంగాణ యువకులు!

2

KCR: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో యాగం నిర్వహించిన కేసీఆర్ దంపతులు.. అసలు కారణం ఇదేనా..?..

3

DA Hike 2026: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా గిఫ్ట్.. రెండు పెండింగ్ డీఏల విడుదలకు ఉత్తర్వులు జారీ

4

‘జైలర్ 2’ ఫస్ట్ రివ్యూ.. రజినీకాంత్ ఖాతాలో మరో హిట్ గ్యారంటీనా..

5

Mangalagiri Lodge Incident: ప్రమోషన్ వీడియో అని పిలిచి మంగళగిరిలో యువతిపై అత్యాచారం..రూ.14,000 దోపిడి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mangalagiri Lodge Incident Case: కడప జిల్లాకు చెందిన ఓ యువతి సింగర్, యాంకర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమెకు మంగళగిరికి చెందిన జిలానీ అలియాస్ సిద్దిక్‌తో పరిచయం ఏర్పడింది. విజయవాడలో తనకు ఓ పెట్ షాప్ ఉందంటూ నమ్మబలికిన జిలానీ, పరిచయం జరిగిన మూడు నెలల తర్వాత ఆ షాప్‌నకు సంబంధించి ప్రమోషనల్ రీల్స్ చేయాల్సిందిగా ఆమెను కోరాడు. ఈ రీల్స్ చేసినందుకు గాను రూ. 30,000 పారితోషికం చెల్లిస్తానని ఆశచూపాడు. అతని మాటలను నిజమని నమ్మిన బాధితురాలు గత నెల 20వ తేదీన మంగళగిరికి చేరుకుంది.

లాడ్జి గదిలో మత్తుమందు ఇవ్వడం..
మంగళగిరి చేరుకున్న అనంతరం, స్థానిక లాడ్జిలోని రూమ్ నంబర్ 303లో ఉండాలని జిలానీ ఆమెకు సూచించాడు. బాధితురాలు ఆ గదిలో వేచి చూస్తుండగా, అక్కడికి వచ్చిన నిందితుడు తాగడానికి మంచినీరు అందించాడు. నీరు తాగిన వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో నిందితుడు జిలానీ ఆమెను వివస్త్రను చేసి నగ్నంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించాడు.

అత్యాచారం, ఆర్థిక దోపిడీ.. 
సుమారు మూడు గంటల తర్వాత బాధితురాలు స్పృహలోకి రాగా, ఆ న్యూడ్ ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరిస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె మొబైల్ ఫోన్ ఉపయోగించి రూ. 16,000 ఫోన్‌పే ద్వారా బదిలీ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని తీవ్రంగా బెదిరించి, లాడ్జి గదికి బయట నుంచి గడియపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.

మరుసటి రోజు అతికష్టం మీద గది నుంచి బయటపడిన బాధితురాలు స్వగ్రామమైన కడపకు చేరుకుంది. అయితే కడపకు వెళ్లిన తర్వాత కూడా నిందితుడి నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ రావడంతో, తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె గత నెల 24న కడప పోలీసులను ఆశ్రయించింది.

ఘటన మంగళగిరి పోలీసు స్టేషన్ పరిధిలో జరగడంతో కడప పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం కేసును మంగళగిరి పట్టణ పోలీసులకు బదిలీ చేశారు. కేసు స్వీకరించిన మంగళగిరి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడు జిలానీని అదుపులోకి తీసుకున్నారు. లాడ్జిలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారాలను సేకరిస్తూ, త్వరలోనే నిందితుడి అధికారిక అరెస్టును చూపిస్తామని వెల్లడించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
Vijayawada
Andhra Pradesh
Telugu News