• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /OPPO A7 Pro వచ్చేసింది.. భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ కెమెరా, 80W ఛార్జింగ్.. ధర ఎంతంటే?

OPPO A7 Pro వచ్చేసింది.. భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ కెమెరా, 80W ఛార్జింగ్.. ధర ఎంతంటే?

OPPO A7 Pro Launched: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఒప్పో A7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కూడా లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 13, 2026, 02:28 PM IST|Updated: Nov 13, 2026, 02:32 PM IST
joinshare
OPPO A7 Pro వచ్చేసింది.. భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ కెమెరా, 80W ఛార్జింగ్.. ధర ఎంతంటే?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Love Failure: కులం అడ్డంకితో ప్రేమ విఫలం.. కాబోయే మహిళా ఎస్సై ఆత్మహత్య

Love Failure: కులం అడ్డంకితో ప్రేమ విఫలం.. కాబోయే మహిళా ఎస్సై ఆత్మహత్య

2

యువకుడిని క*త్తులతో పొడిచి.. స్కూటర్‌పై ఇంటి ముందు పడేసిన దుండగులు.. వీడియో!

3

రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. త్వరలోనే RAC టికెట్ల రద్దు? ప్రయాణికులకు ఇకపై ఫుల్ బెర్త్ గ్యారెంటీ!

4

India Vs New Zealand: టీమిండియాకు ఘోర అవమానం.. వన్డే చరిత్రలో రెండో అతిపెద్ద ఓటమి..!

5

Maya Lady Movie Review: ‘మాయ లేడి’ మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

OPPO A7 Pro Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన A సిరీస్‌లో భాగంగా మరో కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. దీనిని కంపెనీ ఒప్పో A7 ప్రో పేరుతో లాంచ్‌ చేసింది. ఇది యూరోపియన్ మార్కెట్‌లో అధికారికంగా లాంచ్‌ అయ్యింది.. గత సెప్టెంబర్‌లోనే చైనాలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.. ఈ మోడల్‌ను తాజాగా యూరప్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో పాటు ప్రత్యేకమైన వాటర్ రెసిస్టెన్స్, శక్తివంతమైన సెల్ఫీ కెమెరాతో లాంచ్‌ అయ్యింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యూరోపియన్ మార్కెట్‌లోకి ఈ  ఒప్పో A7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కేవలం 6GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లాంచ్‌ అయినట్లు కంపెనీ వెల్లడించింది.. దీని అసలు ధరను 499 యూరోలుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.52,000లు ఉంటుంది.. అయితే, సేల్‌ ఆఫర్‌లో భాగంగా ఒప్పో బెల్జియం ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌పై 70 యూరోలకే లభిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు రూ.7 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.. ఈ స్మార్ట్‌ఫోన్ షైన్ టైటానియంతో పాటు సర్ఫింగ్ బ్లూ అనే రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ కానుంది.

ఒప్పో A7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.57-అంగుళాల ఫుల్ HD ప్లస్‌ AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.. ఇది 2372x1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 1,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని సమాచారం. దీంతో పాటు ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 MAX చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత లేటెస్ట్ కలర్‌ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వెనక వైపు అద్భుతమైన డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో OIS సపోర్ట్ కూడా లభిస్తోంది. అంతేకాకుండా 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు.. అదనంగా 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కెమెరా కూడా లభిస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో 50-మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఈ ఫోన్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ 7,400mAh భారీ బ్యాటరీని కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఇందులో కంపెనీ ఛార్జ్ చేయడానికి 80W సూపర్ వూక్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించింది.. అంతేకాకుండా ఇతర డివైజ్‌లను ఛార్జ్ సింపుల్‌ ఛార్జ్‌ చేసేందుకు.. 10W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇవే కాకుండా ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్స్‌ కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్‌లోకి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News