SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Oppo నుంచి అదిరిపోయే 5G ఫోన్లు.. F35, F35 Pro ఫీచర్లు లీక్.. పూర్తి వివరాలు ఇవే!

Oppo F35 5g: త్వరతోనే మార్కెట్‌లోకి ఒప్పో ఎఫ్35 5జి, ఒప్పో ఎఫ్35 ప్రో 5జి స్మార్ట్‌ఫోన్స్‌ లాంచ్‌ కాబోతున్నాయి. దీనిని కంపెనీ అద్భుతమైన డిజైన్స్‌తో విడుదల కాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Oct 02, 2026, 03:05 PM IST | Updated: Oct 02, 2026, 03:07 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Oppo F35 5g: భారత మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతున్న స్మార్ట్‌ఫోన్స్‌ బ్రాండ్స్‌లో ఒప్పో (Oppo) కూడా ఒకటి. ఇది తమ పాపులర్ F సిరీస్‌లో కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన F సిరీస్‌ మోడళ్లకు కొనసాగింపుగా Oppo F35 5G, Oppo F35 Pro 5G స్మార్ట్‌ఫోన్స్‌ను త్వరలోనే భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇవి అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండడమే కాకుండా ప్రీమియం డిజైన్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

లీక్‌ అయిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ కలిగి అద్భుతమైన శక్తివంతమైన 5G చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్‌ చేసేవారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇది 8GB లేదా 12GB వరకు ర్యామ్ (RAM) వేరియంట్లతో లభించే చాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

డిస్‌ప్లే వివరాలు..
ఒప్పో F సిరీస్ అద్భుతమైన స్లిమ్ డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ Oppo F35 సిరీస్‌లో కూడా హై-రిఫ్రెష్ రేట్‌తో కూడిన కర్వ్‌డ్ లేదా ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది కంటెంట్ స్ట్రీమింగ్‌తో పాటు బ్రౌజింగ్ సమయంలో యూజర్లకు మంచి అనుభూతిని అందించేందుకు సహాయపడుతుంది. ప్రీమియం గ్లాస్ బ్యాక్ ఫినిష్‌తో పాటు కొన్ని ట్రెండీ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..

కెమెరా వివరాలు..
ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో హై-రిజల్యూషన్ ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. AI సపోర్ట్‌తో కూడిన పోర్ట్రెయిట్ మోడ్, లో-లైట్ ఫోటోగ్రఫీ ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా అత్యంత శక్తివంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ (SuperVOOC) సపోర్ట్‌తో కూడిన పెద్ద బ్యాటరీ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.

లాంచ్ తేది వివరాలు..
Oppo F35 సిరీస్‌కు సంబంధించిన అధికారక ప్రకటన ఇంకా రానప్పటికీ.. గీక్‌బెంచ్‌తో పాటు పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్స్‌ కూడా అందుబాటులోకి ఉన్నాయి. కొద్ది వారాల్లోనే ఇండియా లాంచ్ తేదీపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారిక సమాచారం.. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ధర వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES