PM ఫసల్ బీమా యోజన 2026.. లోన్ లేని రైతులకు కూడా పంటల బీమా! ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
PM Fasal Bima Yojana: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) ద్వారా పంట బీమా అర్హులైన రైతులకు అందిస్తున్నారు. ఇది విపత్తు సమయంలో వారికి ఆర్థిక నష్టాన్ని నివారిస్తుంది. ప్రధానంగా చాలామంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోని రైతులు కూడా ఈ బీమా సౌకర్యం పొందవచ్చు. దీనికి ఉన్న గైడ్‌లైన్స్ ఏంటి? అర్హతలు తెలుసుకుందాం.
PM Fasal Bima Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. ఇవి ప్రధానంగా మహిళలు, రైతులకు ఉపయోగకరమైనవి. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు పంట నష్టం వాటిల్లుతుంది. ప్రధానంగా బ్యాంకుల నుంచి రుణం తీసుకోని రైతులు కూడా సులభంగా ఈ బీమా ద్వారా లబ్ది పొందవచ్చు. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల చేతికి వచ్చే పంటకు నష్టం వాటిల్లుతుంది. ప్రధానంగా తుఫాను, భారీ వర్షాలు, వరదలు, కరువు సమయాల్లో పంటలపై ప్రభావం పడుతుంది. దీంతో పంట నష్టపోతాం. ఇది ఆర్థికంగా రైతును నష్టపోయేలా చేస్తుంది. ఆ సమయంలో పీఎం ఫసల్ బీమా యోజన ఎంతగానో ఉపయోగపడుతుంది.
పీఎంఎఫ్‌బీఐకు దరఖాస్తు చేసుకునే విధానం..
ఆసక్తి ఉన్న రైతులు ఈ పీఎం ఫసల్ బీమాకు దరఖాస్తు చేసుకోవచచు. దీనికి మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ బ్రాంచీకి వెళ్లండి. లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC), ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ లేదా అథరైజ్ ఉన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు ఫసల్ బీమా అధికారిక పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.
ముందుగా pmfby.gov.in లేదా pmfby.gov.in ఓపెన్ చేసి దీనికి సంబంధించిన వివరాలు, అప్లికేషన్ విధానం, నోటిఫైడ్ క్రాప్స్, ఇన్సూరెన్స్ కవరేజీ, సంబంధిత వివరాలను పొందవచ్చు. ముందుగా ఈ అప్లికేషన్ డెడ్‌లైన్ కూడా చెక్ చేయండి. కావాల్సిన డాక్యుమెంట్స్, ప్రీమియం, అర్హత, లొకేషన్ కూడా చెక్ చేసుకోండి.
ఇక ఈ బీమాకు సంబంధించిన వివరాలు రైతులు పొందాలంటే కిసాన్ హెల్ప్‌లైన్ నెంబర్ 14447 కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ బీమాకు సంబంధించి కొత్తగా జారీ అయిన గైడ్‌లైన్స్, నమోదు ప్రక్రియను కూడా తెలుసుకోవాలి.
పీఎం ఫసల్ బీమా యోజన నాన్ లోన్ అర్హత ఉన్న రైతులకు ఇది బెస్ట్ . బ్యాంకు నుంచి ఎలాంటి రుణం పొందకున్నా వారి పంటకు బీమా లభిస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న అధికారుల వివరాలను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక తమ పంట నష్టం నుంచి రైతులు సులభంగా బయటపడవచ్చు.