PM Kisan 24th Installment: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రారంభించింది. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద ప్రతి విడతలో రూ. 2000 చొప్పున రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నిధులు జమ అవుతున్నాయి. ఇవి వారి సాగు ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఏడాది రూ.6000 నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున విడుదల చేస్తుంటారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 23 విడతలను విడుదల చేసింది. తాజాగా అక్టోబర్ 30వ తేదీన 24వ విడత నిధులు మంజూరవుతాయని రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే, దీనికి ముందుగా రైతులు కొన్ని పనులు పూర్తి చేయాలి. అలా చేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయి.
పీఎం కిసాన్ యోజన ద్వారా రూ. 6000 మంది రైతులు సహాయం పొందుతున్నారు. ఈ చిన్నపాటి సహాయం వారి సాగు ఖర్చులకు ఉపయోగపడుతుంది. తదుపరి విడత కోసం రైతులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే వారి ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. 24వ విడత 2026 అక్టోబర్ 30వ తేదీ, శుక్రవారం విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. గుజరాత్‌లోని బనస్కాంతలో జరగనున్న కార్యక్రమం సందర్భంగా అక్కడ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పీఎం కిసాన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా షేర్ చేసింది.
ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందాలంటే, ముందుగానే రైతులు పీఎం కిసాన్ ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. అధికారిక వెబ్‌సైట్‌లో ఓటీపీ ఆధారంగా దీనిని పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా, కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ-కేవైసీ పూర్తయితేనే పీఎం కిసాన్ నిధులు జారీ అవుతాయి.
ఇక పీఎం కిసాన్ నిధులు మంజూరయ్యాయా? లేదా? అనేది అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చు. ముందుగా pmkisan.gov.in ను తెరిచి, ఫార్మర్స్ కార్నర్ విభాగాన్ని ఎంచుకోవాలి. అక్కడ "Know Your Status" ఎంపికను ఎంచుకుని, మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇతర వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ధృవీకరించాలి. అప్పుడు స్క్రీన్‌పై పేమెంట్ స్టేటస్, బ్యాంకు పేరు ఇతర వివరాలతో పాటు, మీ ఖాతాలో క్రెడిట్ అయిన నిధుల జాబితా కనిపిస్తుంది.