• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విశాఖపట్నం
  • /Anand Mahindra On Vizag Beach: "వైజాగ్‌లో ఇంతటి అందమైన బీచ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు?" ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

Anand Mahindra On Vizag Beach: "వైజాగ్‌లో ఇంతటి అందమైన బీచ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు?" ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

Anand Mahindra Gangavaram Beach: విశాఖపట్నం సమీపంలోని గంగవరం బీచ్ సహజ సౌందర్యాన్ని ప్రశంసిస్తూ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైజాగ్ ఒక ప్రధాన టెక్నాలజీ కేంద్రంగా ఎదుగుతూనే, దేశంలోనే విశిష్ట తీరప్రాంత విహార కేంద్రంగా మారే సత్తా కలిగి ఉందని ఆయన వివరించారు. అదేవిధంగా గతంలో తాను సందర్శించిన రిషికేశ్.. అది పర్యాటక ప్రాంతంగా వచ్చిన మార్పులను కాపాడుకోవాలని ఆకాంక్షించారు.

Written ByHarish Darla
Published: Oct 25, 2026, 07:51 PM IST|Updated: Oct 25, 2026, 07:55 PM IST
joinshare
Anand Mahindra On Vizag Beach: "వైజాగ్‌లో ఇంతటి అందమైన బీచ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు?" ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
School Holiday Tomorrow: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..తెలంగాణలో ఈ స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు!

School Holiday Tomorrow: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..తెలంగాణలో ఈ స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు!

2

Nominations: ఏపీలో 'పరిషత్‌' ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య హోరాహోరీ

3

అక్టోబర్ 30న రైతు ఖాతాల్లో రూ.2000 జమ.. డబ్బులు పడాలంటే ఈ పనులు వెంటనే చేయండి!

4

Anand Mahindra On Vizag Beach: "వైజాగ్‌లో ఇంతటి అందమైన బీచ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు?" ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

5

Chandrababu: అర్నాబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Anand Mahindra Gangavaram Beach: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా వైజాగ్‌లోని గంగవరం బీచ్ చిత్రాలను 'X' వేదికగా పంచుకుంటూ, భారతదేశంలో చర్చించే పర్యాటక ప్రాంతాల జాబితాలో ఈ బీచ్ ఎందుకు లేదని ప్రశ్నించారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంచే బీచ్‌లలో కనిపించే కొబ్బరి చెట్లు లేదా పోస్ట్‌కార్డ్ తరహా దృశ్యాలు ఇక్కడ ఉండవని ఆయన పేర్కొన్నారు.

వీటికి భిన్నంగా ఎత్తైన రాతి కొండలు, రాతి భూభాగంతో కూడిన ఈ ప్రాంతం దాదాపుగా చరిత్రపూర్వ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆనంద్ మహీంద్రా విశ్లేషించారు. ఇలాంటి విభిన్నమైన ప్రకృతి ఒడి తనను ఎంతగానో ఆకర్షిస్తుందని, ఇది కేవలం విహారానికే కాకుండా ఆత్మపరిశీలన చేసుకోవడానికి అనువైన ప్రదేశమని ఆయన కొనియాడారు.

ఆంధ్రప్రదే‌శ్‌లోని విశాఖపట్నం సహజ ప్రకృతి దృశ్యాలకు, నగరంలో పెరుగుతున్న సాంకేతిక ప్రగతికి మధ్య ఉన్న తేడాను పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆయన వివరించారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు, ఏఐ (AI) మౌలిక సదుపాయాల నిర్మాణానికి వైజాగ్‌కు తరలివస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

అయితే నేటి సంస్థలు ఇప్పుడు సాంకేతిక మౌలిక వసతులను నిర్మిస్తుంటే, ప్రకృతి మాత్రం లక్షలాది సంవత్సరాల క్రితమే ఇక్కడ హైపర్‌స్కేలింగ్‌ను ఆరంభించిందని ఆయన చమత్కరించారు. వైజాగ్ కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా, దేశంలోనే అత్యంత ఆదరణ పొందే తీరప్రాంత పర్యాటక గమ్యస్థానంగా మారే అవకాశం ఉందని, నగరంలో పలు రకాల వృద్ధి కథలు ఒకేసారి రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు.

రిషికేశ్ జ్ఞాపకాలు..
మరో పర్యాటక ప్రాంతమైన రిషికేశ్ మారుతున్న రూపురేఖలను సైతం మహీంద్రా గుర్తుచేసుకున్నారు. తన విద్యార్థి దశలో 'థీసిస్' సినిమా చిత్రీకరణ సమయంలో చోటివాలా రెస్టారెంట్ తన క్యాంటీన్‌లా ఉండేదని, స్వర్గాశ్రమం వెనుక కొండల్లో బంఖండీ బాబా అనే సాధువుపై డాక్యుమెంటరీ తీసిన క్షణాలను నెమరువేసుకున్నారు.

నదితీరంలోని వాకింగ్ స్ట్రీట్స్, అందమైన లోకేషన్స్‌తో రిషికేశ్ సరికొత్త రూపు సంతరించుకోవడం ఎంతో మంచి పరిణామం అని ఆనంద్ మహింద్రా అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ఆధునిక మార్పుల మధ్య రిషికేశ్ తన మూల స్వభావాన్ని, ఆధ్యాత్మిక ఆత్మను కోల్పోకుండా నిలుపుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Visakhaptnam
AP News
Andhra Pradesh
Telugu News