SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ షాక్! ఆ తప్పు చేస్తే రూ. 2,000 పడవు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరమైన పథకాన్ని పరిచయం చేసింది. ఇది వారి సాగు ఖర్చులకు ఎంతో తోడ్పడుతుంది. ప్రతి ఏడాది ఈ పథకం ద్వారా రూ.6,000 నేరుగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ అవుతాయి. ప్రస్తుతం రైతులు 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఈసారి కొంతమందికి పీఎం కిసాన్ నిధులు అందకపోవచ్చు. మీ పేరు కూడా అందులో ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి.

Written By Renuka Godugu
Published: Sep 26, 2026, 10:10 AM IST | Updated: Sep 26, 2026, 10:39 AM IST
Image Credit: PM Kisan 24th Installment
Join

PM Kisan 24th Installment: ప్రధానమంత్రి కిసాన్ సామాన్య యోజన ద్వారా ప్రతి ఏడాది రూ.6,000 రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయబడుతున్నాయి. ఇవి రైతుల సాగు ఖర్చులకు ఎంతో సహాయపడుతున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాల్లో పీఎం కిసాన్ అత్యంత ప్రఖ్యాతి గాంచిన పథకం. అర్హత ఉన్న రైతులందరికీ ఈ నిధులు అందుతాయి. ప్రస్తుతం రైతులు 24వ విడత కోసం వేచి చూస్తున్నారు, కానీ ఈ విడతలో కొంతమందికి నిధులు అందకపోవడానికి కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కేవైసీ తప్పనిసరి:
ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధులు పొందాలంటే రైతులు ముందుగానే కొన్ని పనులు పూర్తి చేసుకోవాలి. వీటిని ఆన్‌లైన్‌లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా పూర్తి చేయవచ్చు. అలాగే, పీఎం కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని కూడా మీ కేవైసీ పనులను పూర్తి చేస్తే 24వ విడత నిధులు పొందవచ్చు.

భూ రికార్డులు:
కేవైసీ మాత్రమే కాకుండా, పిఎం కిసాన్ నిధులు పొందాలంటే భూ రికార్డులు కూడా సరిగ్గా ఉండాలి. దీనివల్ల ఆ భూమి రైతుకు చెందినదేనని ధృవీకరించబడుతుంది. ఒకవేళ ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే, తదుపరి విడత నిధులు పొందడం సాధ్యం కాదు.

ఆధార్ లింక్:
మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండటం కూడా తప్పనిసరి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం, ప్రభుత్వం నుండి నిధులు నేరుగా ఖాతాలో జమ కావాలంటే ఆధార్ లింక్ తప్పనిసరిగా ఉండాలి. ఇది పూర్తి చేయకపోతే తదుపరి విడత నిధులు రావు. కాబట్టి, రైతులు వెంటనే బ్యాంకు బ్రాంచ్‌ను సందర్శించి, తమ ఖాతాకు ఆధార్ లింక్ అయిందో లేదో సరిచూసుకుని ఆ పని పూర్తి చేయాలి.

రైతుల నిరీక్షణకు తెర.. అక్టోబర్‌లోనే పీఎం కిసాన్ డబ్బులు! మీ ఖాతాలో పడాలంటే ఇది తప్పనిసరి?
24వ విడత ఎప్పుడు?
ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతుంటాయి. ఈ లెక్కన 24వ విడత అక్టోబర్ నెలలో జమ అయ్యే అవకాశం ఉంది. దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయి కాబట్టి, ఈ నిధులు పండుగల ముందే విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే, 24వ విడత తేదీ గురించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నిధులు పొందాలంటే ముందుగానే కేవైసీ పూర్తి చేయండి, భూ రికార్డులను సరిచూసుకోండి మరియు ఆధార్ లింక్‌ను తప్పనిసరిగా పూర్తి చేయండి.

అర్హత నిబంధనలు:
ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద ప్రతి నెలా రూ.10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. అంతేకాకుండా, ఒక కుటుంబంలో కేవలం ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హత కలిగి ఉండాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులు కారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES