PM Kisan Update: ప్రతి ఏడాది రూ. 6000 నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో మంజూరు చేస్తుంది. ఈ నిధులను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2000 చొప్పున విడతలవారీగా అందిస్తారు. ఇప్పటివరకు 23వ విడత వరకు నిధులు అందాయి. జూన్ 20వ తేదీన నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏటా ఇలా రూ. 6000 అందుతాయి. ప్రస్తుతం అందరూ 24వ విడత కోసం వేచి చూస్తున్నారు.
24వ విడత పిఎం కిసాన్ నిధులు అక్టోబర్ నెలలోనే విడుదలవుతాయని రైతులు ఆశిస్తున్నారు. డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నిలేష్ చౌరాసియా మాట్లాడుతూ, అక్టోబర్ నెలలో ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. నవంబర్ 8 దీపావళి లోపే పిఎం కిసాన్ నిధులు మంజూరు కావచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ 24వ విడత రైతులకు దీపావళి కానుకగా ఉంటుందని వారు భావిస్తున్నారు. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లేదా మోసపూరిత లింకులను క్లిక్ చేయవద్దని, మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం జరిగింది.
ప్రధానమంత్రి కిసాన్ పథకం..
ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద అర్హులైన రైతులు ప్రతి ఏటా రూ. 6000 పొందుతున్నారు. ఈ నగదు నాలుగు నెలల విరామంతో రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. రైతులు తమ రిజిస్ట్రేషన్ వివరాలను అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in లో రివ్యూ చేసుకునే అవకాశం ఉంది, అక్కడ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం:
ప్రధానమంత్రి కిసాన్ పథకంలో మీ స్టేటస్‌ను తెలుసుకోవడానికి pmkisan.gov.in వెబ్‌సైట్‌ను ఎంచుకోండి. హోమ్ పేజీలో మీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, ఓటిపి (OTP) ద్వారా వెరిఫై చేయాలి. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
పీఎం కిసాన్ నిధులు నిలిచిపోకుండా ఉండాలంటే రైతులు ముందుగానే ఈ కేవైసీ (KYC) పనులను పూర్తి చేయాలి. అలాగే భూ రికార్డులను వెరిఫై చేయించుకోవాలి మరియు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయి ఉండాలి. ఈ నిబంధనలు పాటించే వారికి మాత్రమే పిఎం కిసాన్ నిధులు మంజూరు చేయబడతాయి.